పుష్ప 2: 36 రోజుల కలెక్షన్స్.. లెక్క ఎంతవరకు వెళ్లిందంటే..
ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన పుష్ప 2 ఇప్పటికే టాప్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.
By: Tupaki Desk | 10 Jan 2025 10:22 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా చిత్రం పుష్ప 2: ది రూల్ థియేటర్లకు వచ్చి నెల రోజులు దాటినా కూడా మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఇక వీకెండ్స్ ఉంటే ఇప్పటికి కూడా కోటికి పైగా కలెక్షన్లు రావడం విశేషం. సినిమా సూపర్ హిట్ టాక్‌తో మొదలైన ఈ ప్రయాణం, ఆర్థిక పరంగా కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. 617 కోట్ల థియేట్రికల్ బిజినెస్‌తో రిలీజ్ అయిన ఈ చిత్రం, బ్లాక్‌బస్టర్‌గా నిలిచి బ్రేక్ ఈవెన్ పూర్తిచేసి, దాదాపు 210 కోట్ల లాభాలను సాధించింది.
ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన పుష్ప 2 ఇప్పటికే టాప్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. లోకల్ గా బాహుబలి రికార్డ్ లను సైతం బ్రేక్ చేయడం విశేషం. దేశీయంగా ఓవర్సీస్‌లో మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. బన్నీ యాక్టింగ్, సుకుమార్ దర్శకత్వం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే కీలక కారణాలుగా మారాయి.
తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 రికార్డు స్థాయి కలెక్షన్లను సాధించింది.
నైజాంలో: 103.62 కోట్లు
సీడెడ్‌లో: 35.35 కోట్లు
ఉత్తరాంధ్రలో: 24.91 కోట్లు
గుంటూరులో: ₹15.98 కోట్లు
కృష్ణా: 13.13 కోట్లు
మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి ఈ చిత్రం 225.05 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఈ స్థాయిలో కలెక్షన్లు సాధించిన మరో చిత్రం ఈ మధ్య కాలంలో లేదు.
హిందీ వెర్షన్ లో పుష్ప 2 విజయవంతమైన పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. హిందీ బాక్సాఫీస్‌లో ఈ చిత్రం రూ. 382.35 కోట్ల షేర్‌ను సాధించింది. మాస్ మసాలా కథాంశం, అద్భుతమైన పాటలు, అల్లు అర్జున్ యాక్టింగ్ నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పుష్ప 1 తర్వాత బన్నీకి హిందీలో ఏర్పడిన ఫ్యాన్ బేస్, ఈ సీక్వెల్‌కు మరింత పెరగడానికి తోడ్పడింది.
ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.
కర్ణాటకలో: 53.18 కోట్లు
తమిళనాడులో: 34.70 కోట్లు
కేరళలో: 7.60 కోట్లు
ఓవర్సీస్ నుంచి: 127.05 కోట్లు
మొత్తం ప్రపంచవ్యాప్తంగా: రూ. 829.93 కోట్ల షేర్ రాబట్టింది.
లాభాల పరంగా పుష్ప 2 రికార్డు
617 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చిన పుష్ప 2 ఆ లక్ష్యాన్ని దాటేసి 209.93 కోట్ల లాభాలను నమోదు చేసింది. ఈ లాభాలతో టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో టాప్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బరిలో ఉన్న ఇతర చిత్రాలపై ఈ చిత్రం ప్రభావం చూపినట్లుగా ట్రేడ్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ మొత్తం కలెక్షన్లతో పుష్ప 2 ఒక విశ్వవ్యాప్త సంచలనంగా నిలిచి, అల్లు అర్జున్ క్రేజ్‌ను మరింత పెంచింది.