Begin typing your search above and press return to search.

పుష్ప 2: బుకింగ్స్ తోనే ఊచకోత మొదలైంది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి డిసెంబర్ 5న రాబోయే మోస్ట్ అవైటెడ్ ‘పుష్ప 2’ కోసం దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

By:  Tupaki Desk   |   2 Dec 2024 5:42 AM GMT
పుష్ప 2: బుకింగ్స్ తోనే ఊచకోత మొదలైంది
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి డిసెంబర్ 5న రాబోయే మోస్ట్ అవైటెడ్ ‘పుష్ప 2’ కోసం దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఇండియాలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. ఎవ్వరు ఊహించని స్థాయిలో సినిమాకి బుకింగ్స్ జరుగుతూ ఉండటం విశేషం. సినిమా రిలీజ్ కి ఇంకా మూడు రోజుల సమయం ఉంది. ఆల్ ఓవర్ ఇండియాలో 15,754 షోలకి అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.

25.37% ఆక్యుపెన్సీ టికెట్స్ బుక్ అయిపోయినట్లు తెలుస్తోంది. వీటి ద్వారా 32.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ఇప్పటి వరకు వసూళ్లు అయ్యాయి. దీనిని బట్టి సినిమాకి ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందో అంచనా వేయవచ్చు. ఇక ఈ అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ డిసెంబర్ 5న రిలీజ్ నాటికి 60 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వస్తే కచ్చితంగా రికార్డ్ అని చెప్పొచ్చు.

ఇక ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో 16.35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. హిందీ బెల్ట్ లో 14.84 కోట్ల కలెక్షన్స్ వసూళ్లు అయ్యాయి. హిందీ భాషలో ఈ స్థాయిలో కలెక్షన్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రావడం అంటే పుష్ప 2కి అక్కడ ప్రేక్షకుల రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉందనేది అర్ధం చేసుకోవచ్చు. బుకింగ్స్ లో ఇదే జోరు కొనసాగితే 60 కోట్ల మార్క్ ఈజీగా దాటేస్తుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

ఐకాన్ స్టార్ ఇమేజ్, ‘పుష్ప 2’ మానియా చాలా అడ్వాన్స్ బుకింగ్స్ లో చాలా స్ట్రాంగ్ గా పని చేస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ తో ఆర్ఆర్ఆర్ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఈ మూవీ 1000 కోట్ల మార్క్ ని చాలా వేగంగా అందుకునే అవకాశం ఉంటుందని ట్రేడ్ వర్గాలలో అనుకుంటున్నారు.

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మార్కెట్, బ్రాండ్ ఇమేజ్ కూడా ‘పుష్ప 2’ తర్వాత అమాంతం పెరిగిపోవడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ రేంజ్ నెక్స్ట్ అతని సినిమాల మార్కెట్ ని కూడా డిసైడ్ చేస్తాయి. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక మార్కెట్ ఉన్న హీరోగా ప్రభాస్ ఉన్నాడు. ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ కూడా ప్రభాస్ రేంజ్ మార్కెట్ ని అందుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.