పుష్ప 2 బాక్సాఫీస్.. ఏపీ+తెలంగాణలో ఇంకెంత రావాలి?
అయితే తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఏపీ+తెలంగాణలో 'పుష్ప 2' మొదటి వారం 60 శాతం వసూళ్లను మాత్రమే రాబట్టగలిగినట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 13 Dec 2024 5:00 AM GMT'పుష్ప 2' దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులను తుడిచిపెట్టేస్తోంది. హిందీ వెర్షన్ విశేషంగా వసూళ్లు సాధించి, అక్కడి ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. నార్త్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా అల్లు అర్జున్ బాక్సాఫీస్ డామినేషన్ కు ఫిదా అయిపోయారు. వరల్డ్ వైడ్ 1000 కోట్లను రాబట్టి పుష్ప 2 ద్వారా బన్నీ తన స్టామినా ఏంటో నిరూపించాడు. ఈ క్రమంలో 'పుష్ప 2' హిందీ వెర్షన్ తొలి విజయోత్సవ వేడుక న్యూఢిల్లీలో జరగడం విశేషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అర్జున్, నార్త్ ప్రేక్షకుల ప్రేమ తన హృదయంలో నిలిచిపోతుందని చెప్పారు.
అయితే తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మాత్రం కొంచెం భిన్నంగా ఉంది. ఏపీ+తెలంగాణలో 'పుష్ప 2' మొదటి వారం 65 శాతం వసూళ్లను మాత్రమే రాబట్టగలిగినట్లు తెలుస్తోంది. ఇది సినిమా బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు కాస్త కలవరం కలిగిస్తోంది. ఇప్పటివరకు హై రేంజ్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. హాలిడేస్ లేని టైమ్ లో ఈ తరహా వసూళ్ళు సాధించడం అనేది మాములు విషయం కాదు. ఇక రెండవ వారం మొదట్లో కాస్త గట్టిగానే ప్రభావం చూపినప్పటికి మంగళవారం కాస్త నెంబర్లు తగ్గాయి.
ఈ శుక్ర,శని ,ఆదివారం వరకూ మంచి కలెక్షన్లను సాధిస్తేనే వారు లాభాల దిశగా ప్రయాణం ప్రారంభమవుతుంది. పుష్ప 1 సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అయితే నైజాంలో నష్టాలు రాలేదు. కానీ ఆంధ్రలో టిక్కెట్లు రేట్లు తక్కువగా ఉండడం వలన నష్టాలు వచ్చాయి. ఇక ఇప్పుడు పుష్ప 2కి హై రేంజ్ డిమాండ్ ఉండడంతో బయ్యర్లు భారీ ధరలకు కొనుగోలు చేశారు. ఫస్ట్ వీకెండ్ సాలీడ్ గా వసూళ్ళు అయితే వచ్చాయి.
ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో పది శాతం వరకు నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉందని ఓ వర్గం విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో అధిక ధరలకు సినిమా హక్కులు తీసుకున్న కొంతమంది డిస్ట్రిబ్యూటర్లకు భారీ ఆందోళన కలిగిస్తోంది. ఈ వారం చివరలో సినిమాకు భారీ కలెక్షన్లు వస్తేనే ఈ సమస్య కొంతవరకు పరిష్కారమవుతుంది. ఇప్పుడు ఈ మూడు రోజులు బాక్సాఫీస్ రన్‌లో చాలా కీలకం కానున్నాయి. ఎనిమిదో రోజు 9.4 కోట్ల గ్రాస్‌ను 'పుష్ప 2' తెలుగు వెర్షన్ నమోదు చేసింది. ఇది అనుకున్న స్థాయికి చాలా తక్కువ. అయితే, టికెట్ ధరల పెంపుతో ఈ సంఖ్య ఇప్పటికైతే స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, ఈ స్థాయిని మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, బయ్యర్లు లాభాల బాట పట్టేందుకు ఇప్పటికీ ఇంకా 30 శాతం వసూళ్లు రావాలి.
తెలుగు వెర్షన్ డిస్ట్రిబ్యూటర్లకు ఉపశమనం కలగాలంటే ఈ వారం చివరిదాకా సినిమా విజయవంతంగా పరుగులు తీస్తూ మంచి రాబడిని సాధించాలి. ముఖ్యంగా, ఆదివారం రోజున భారీ కలెక్షన్లు నమోదు చేయడమే కీలకం. సినిమా స్పందనకు అనుగుణంగా ఈ పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి. మొత్తానికి, 'పుష్ప 2' హిందీ వెర్షన్ రికార్డులు సృష్టిస్తున్న నేపథ్యంలో, తెలుగు వెర్షన్ ఆందోళనలో ఉంది. రాబోయే మూడు రోజులు ఈ సినిమా భవిష్యత్‌ను నిర్ణయించగలవు. ప్రదర్శనతో పాటు, ప్రేక్షకుల ఆదరణ మళ్ళీ భారీగా పెరుగుతుందా? అన్నది ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.