Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియాలో పుష్ప రాజ్ బ్లాస్ట్.. టాప్ 10 లిస్ట్ ఇదే..

ఇప్పటికే యూఎస్ లో ఈ మూవీ 14 మిలియన్ డాలర్స్ క్రాస్ చేసింది.

By:  Tupaki Desk   |   23 Dec 2024 6:21 AM GMT
ఆస్ట్రేలియాలో పుష్ప రాజ్ బ్లాస్ట్.. టాప్ 10 లిస్ట్ ఇదే..
X

పుష్ప 2 హంగామా కేవలం ఇండియాలోనే కాకుండా యూఎస్, యూకే, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఉన్న ఇండియన్స్ ‘పుష్ప 2’ చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారు. దీంతో కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి. ఇప్పటికే యూఎస్ లో ఈ మూవీ 14 మిలియన్ డాలర్స్ క్రాస్ చేసింది. ఇండియాలో 1100 కోట్లకి దగ్గరగా ఈ మూవీ కలెక్షన్స్ ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియాలో కూడా ఇప్పుడు ‘బాహుబలి 2’కి దగ్గరగా ‘పుష్ప 2’ కలెక్షన్స్ ఉండటం విశేషం.

ఆస్ట్రేలియాలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న తెలుగు సినిమాల జాబితాలో ‘బాహుబలి 2’ మూవీ 4.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ తో టాప్ లో ఉంది. ‘పుష్ప 2’ మూవీ 4.2 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ తో రెండో స్థానంలో ఉంది. మూడో వారంలో ఈ సినిమా ‘బాహుబలి 2’ రికార్డ్ ని బ్రేక్ చేసేలా ఉందని అనుకుంటున్నారు. కేవలం 18 రోజుల్లోనే ‘పుష్ప 2’ మూవీ 4.2 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ వసూళ్లు చేయడం విశేషం.

దీని తర్వాత స్థానంలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఉంది. ఈ సినిమా లాంగ్ రన్ లో 3.6 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ అందుకుంది. నాలుగో స్థానంలో ‘కల్కి 2898ఏడీ’ మూవీ 3.13 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ తో నిలిచింది. ఇక టాప్ 5లో ప్రభాస్ ‘సలార్’ మూవీ 1.75 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ తో ఉండటం విశేషం. దీని తర్వాత స్థానాలలో ‘సాహో’, ‘బాహుబలి’, ‘దేవర 1’, ‘ఆదిపురుష్’, ‘పుష్ప’ ఉన్నాయి. ఆస్ట్రేలియాలో మన పాన్ ఇండియా సినిమాలకి డిమాండ్ పెరుగుతుందని ఈ కలెక్షన్స్ బట్టి చెప్పొచ్చు.

నెక్స్ట్ టాలీవుడ్ లో రానున్న పాన్ ఇండియా సినిమాలు కూడా ఇదే తరహాలో ఆస్ట్రేలియాలో వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది, ‘గేమ్ చేంజర్’, ‘ఓజీ’, ‘హరిహర వీరమల్లు’ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్నాయి. మరి వీటిలో ఏవైనా ‘పుష్ప 2’ తరహాలో ఓవర్సీస్ మార్కెట్ లో వసూళ్లు సాధిస్తాయా అనేది చూడాలి.

బాహుబలి 2 - A$4.5M

పుష్ప 2 - A$4.2M*** (18days)

ఆర్ఆర్ఆర్ - A$3.6M

కల్కి 2898ఏడీ - A$3.13M

సలార్ - A$1.75M

సాహో - A$1.03M

బాహుబలి - A$995K

దేవర పార్ట్ 1 - A$952K

ఆదిపురుష్ - A$901K

పుష్ప 1 - A$629K