Begin typing your search above and press return to search.

బాలీవుడ్ బాక్సాఫీస్: టాప్ 10లో పుష్పరాజ్ బ్రాండ్

సౌత్ ఇండియన్ సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిని దాటి, హిందీ బాక్సాఫీస్‌ను కూడా రికార్డులతో ఆక్రమిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   9 Dec 2024 12:28 PM GMT
బాలీవుడ్ బాక్సాఫీస్: టాప్ 10లో పుష్పరాజ్ బ్రాండ్
X

సౌత్ ఇండియన్ సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిని దాటి, హిందీ బాక్సాఫీస్‌ను కూడా రికార్డులతో ఆక్రమిస్తున్నాయి. హిందీ ప్రేక్షకులకు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలు ఓ సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయని చెప్పవచ్చు. తాజాగా అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన పుష్ప 2: ది రూల్ ఈ జాబితాలో దూసుకెళ్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే పుష్ప 2 హిందీ వెర్షన్‌ రూ. 291 కోట్ల నెట్ కలెక్షన్ సాధించడం విశేషం.

ఈ సినిమా ఇప్పటివరకు ఉన్న పలు రికార్డులను తిరగరాసింది. హిందీలో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సౌత్ సినిమాలలో తెలుగు హీరోల హవా గట్టిగానే నదిస్తోంది. ఇక పుష్ప 2 కూడా ఈ లిస్టులో చేరడం విశేషం. అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాకు ప్రధాన బలం. హిందీ బాక్సాఫీస్‌లో ఈ రేంజ్ వసూళ్లు సాధించడం పుష్ప బ్రాండ్‌ను, అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన స్థాయిని హైలెట్ చేస్తోంది.

పుష్ప 2 విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి, వాటిని నిజం చేస్తూ ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ రికార్డులు సృష్టిస్తోంది. సౌత్ ఇండియన్ టాప్ 10 హిందీ డబ్/డైరెక్ట్ కలెక్షన్స్ జాబితాలో ప్రస్తుతం బాహుబలి 2 అగ్రస్థానంలో కొనసాగుతుండగా, కేజీఎఫ్ 2 రెండవ స్థానాన్ని ఆక్రమించింది. పుష్ప 2 మాత్రం మొదటి నాలుగు రోజుల్లోనే టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చి, RRRను అధిగమించి నాల్గవ స్థానంలో నిలిచింది. ఇది అల్లు అర్జున్ కృషి, సినిమా ప్రాముఖ్యతను మరోసారి చాటిచెబుతోంది.

బాహుబలి 2 (రూ. 511 కోట్లు), కేజీఎఫ్ 2 (రూ. 435.2 కోట్లు), కల్కి 2898 ఎడీ (రూ. 294.50 కోట్లు) వంటి భారీ చిత్రాలు టాప్ 3 స్థానాల్లో ఉండగా, నాలుగు రోజుల్లోనే రూ. 291 కోట్లతో పుష్ప 2 నాలుగవ స్థానాన్ని ఆక్రమించింది. పుష్ప 2 ముందు రోజులలో మరిన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అర్ధమవుతుంది. ఈ జాబితాలో పుష్ప సిరీస్ రెండు చిత్రాలతో కూడా ప్రాముఖ్యత సాధించడం గమనార్హం. పుష్ప 1 హిందీ వెర్షన్ రూ. 108.61 కోట్లు వసూలు చేసి టాప్ 11లో ఉండగా, పుష్ప 2 నాలుగు రోజుల్లోనే దీనికి మించి సత్తా చాటింది.

హిందీలో 4 రోజుల్లో అత్యదిక కలెక్షన్స్ అందుకున్న సౌత్ సినిమాలు

బాహుబలి 2 - రూ. 511 కోట్లు

కేజీఎఫ్ 2 - రూ. 435.2 కోట్లు

కల్కి 2898 ఎడీ - రూ. 294.50 కోట్లు

పుష్ప 2: ది రూల్ - రూ. 291 కోట్లు (నాలుగు రోజులు)

ఆర్ఆర్ఆర్ - రూ. 276.8 కోట్లు

2 పాయింట్ 0 - రూ. 189 కోట్లు

సలార్ 1 - రూ. 153.45 కోట్లు

సాహో - రూ. 150.6 కోట్లు

ఆదిపురుష్ - రూ. 143.25 కోట్లు

బాహుబలి - రూ. 115 కోట్లు

పుష్ప - రూ. 108.61 కోట్లు

అంతే కాకుండా, ఈ గణాంకాలు హిందీ మార్కెట్లో సౌత్ సినిమాల దూకుడు ఏమాత్రం తగ్గలేదని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కేవలం హిందీ మార్కెట్ నుంచే కాకుండా, దేశవ్యాప్తంగా పుష్ప 2 అన్ని భాషల్లో కలిపి కలెక్షన్ల పరంగా భారీ రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే లెక్క 800 కోట్లు దాటింది. ఇక వెయ్యి కోట్లకు ఎంతో సమయం పట్టదని చెప్పవచ్చు. హిందీ ప్రేక్షకులకు అల్లు అర్జున్ నటన, సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే నచ్చడంతో ఈ స్థాయిలో భారీ కలెక్షన్లు నమోదవుతున్నాయి.

డిసెంబర్ 8న విడుదలైన ఈ సినిమా, ఇప్పటి వరకు ఉన్న రికార్డులను తిరగరాసి కొత్త చరిత్ర సృష్టిస్తోంది. హిందీ వెర్షన్ వసూళ్లు ఆగకుండా ముందుకు సాగుతున్నాయి. ట్రేడ్ పండితులు ఈ సినిమాకు సంబంధించి మరింత మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలదు అని భావిస్తున్నారు. హిందీ మార్కెట్‌లో తన సత్తా చాటుకుంటూ, పుష్ప 2 అద్భుతమైన రన్‌ను కొనసాగిస్తోంది.