పుష్ప2.. సడెన్ గా ఎందుకిలా?
ముఖ్యంగా నార్త్ లో పుష్ప-2 ఓ రేంజ్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అలాంటి టైమ్ లో నిన్న రాత్రి అనూహ్య సంఘటన జరిగింది.
By: Tupaki Desk | 20 Dec 2024 8:35 AM GMTటాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప-2.. ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లను సాధిస్తోంది. ఇప్పటి వరకు రూ.1500 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి.. రూ.2వేల కోట్ల క్లబ్ వైపు పరిగెడుతోంది.
హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్ లో రూ.2వేల కోట్లకుపైగా వసూళ్లతో దంగల్ టాప్ లో ఉండగా.. బాహుబలి-2 (రూ.1810 కోట్లు) రెండో స్థానంలో ఉంది. ఇప్పటికే కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ వసూళ్లను దాటేసిన పుష్ప 2: ది రూల్.. ఇప్పుడు బాహుబలి సీక్వెల్ లెక్కలను దాటే దిశగా దూసుకుపోతోంది.
ముఖ్యంగా నార్త్ లో పుష్ప-2 ఓ రేంజ్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అలాంటి టైమ్ లో నిన్న రాత్రి అనూహ్య సంఘటన జరిగింది. ప్రముఖ పీవీఆర్ ఐనాక్స్ మల్టీప్లెకుల్లో పుష్ప-2 బుకింగ్స్ ను నిలిపివేసింది. దీంతో అంతా ఒక్కసారి షాక్ అయ్యారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా పీవీఆర్ మల్టీప్లెక్సులు ఉన్న విషయం తెలిసిందే.
నార్త్ లో అయితే పీవీఆర్ మల్టీప్లెక్సులు.. సినిమాల వసూళ్లలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. దీంతో బుకింగ్స్ ను ఆపేయడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉలిక్కిపడ్డారు. ఆ తర్వాత శుక్రవారం మళ్లీ స్టార్ట్ అయ్యాయి. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నా.. ఇలా జరగడానికి బాలీవుడ్ ఫేమస్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీ డిమాండే కారణమని తెలుస్తోంది.
పుష్ప హిందీ వెర్షన్ ను నార్త్ లో ఆయనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాకు మూడో వారం కూడా భారీ సంఖ్యలో స్క్రీన్స్ ను ఆయన డిమాండ్ చేశారని సమాచారం. మరో ఐదు రోజుల్లో విడుదల కానున్న బేబీ జాన్ మూవీతో ఈక్వెల్ గా పుష్ప-2కు స్క్రీన్స్ కేటాయించాలని అడిగారట. దీంతో పీవీఆర్ నిర్వాహకులు ససేమిరా అన్నారని టాక్.
ఎందుకంటే.. అలా చేస్తే హీరోయిన్ కీర్తి సురేష్ బాలీవుడ్ డెబ్యూ బేబీ జాన్ వసూళ్లపై ఎఫెక్ట్ పడుతుంది. దీంతో పుష్ప-2 బుకింగ్స్ ను పీవీఆర్ నిర్వాహకులు నిలిపివేశారట. ఆ తర్వాత తడానీతో చర్చలు జరిపి మళ్లీ స్టార్ట్ చేశారని తెలుస్తోంది. మొత్తానికి ఇష్యూ క్లోజ్ అయినప్పటికీ.. అల్లు అర్జున్ అభిమానులు మాత్రం కాస్త కలవరపడ్డారు. ఏదేమైనా నార్త్ లో పుష్ప రాజ్ దూకుడు మాములుగా లేదని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.