Begin typing your search above and press return to search.

పుష్ప 2 బాక్సాఫీస్: రెండు వారాల్లో ఎంత వచ్చాయి?

అత్యధిక వేగంగా 1450 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, అల్లు అర్జున్ స్టార్ పవర్‌ను మరోసారి నిరూపించింది.

By:  Tupaki Desk   |   19 Dec 2024 7:09 AM GMT
పుష్ప 2 బాక్సాఫీస్: రెండు వారాల్లో ఎంత వచ్చాయి?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా చిత్రం పుష్ప 2: ది రూల్ రెండు వారాల్లోనే వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రారంభం నుంచి విశేషమైన వసూళ్లను సాధిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. అత్యధిక వేగంగా 1450 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, అల్లు అర్జున్ స్టార్ పవర్‌ను మరోసారి నిరూపించింది.

ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ. 282.91 కోట్ల భారీ ఓపెనింగుతో సినిమా బాక్సాఫీస్‌పై దుమ్మురేపింది. వీకెండ్‌లోనే మొత్తం రూ. 780 కోట్లను అందుకొని రికార్డు సృష్టించింది. హిందీ బెల్ట్ సహా అన్ని భాషల్లో కలెక్షన్లు అద్భుతంగా నమోదవడం గమనార్హం. మొదటి నాలుగు రోజులలోనే రూ. 800 కోట్ల మార్క్‌ను చేరుకోవడం టాలీవుడ్ చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డ్ అని చెప్పవచ్చు.

రెండో వారం కూడా సినిమా తన దూకుడు కొనసాగించింది. రెండవ శనివారం రూ. 82.56 కోట్ల వసూళ్లు సాధించగా, ఆదివారం రూ. 104.24 కోట్లను రాబట్టి తన స్థాయిని నిలబెట్టుకుంది. ఈ వసూళ్లతో బాలీవుడ్ సినిమాలను కూడా మించిపోయేలా కొనసాగింది. రెండవ వారంలోనూ కాస్త తగ్గినా, నిలకడగా వసూళ్లు రాబట్టడం గమనార్హం. అల్లు అర్జున్ నటనతో మాస్ ఎపిసోడ్స్ మంచి కిక్ ఇచ్చాయి.

సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు సినిమాను మరో లెవెల్ కు తీసుకు వెళ్లాయి. ఈ సినిమా బాలీవుడ్ సినిమాలకే గట్టి పోటీగా నిలవడంతో, దేశవ్యాప్తంగా తెలుగు సినిమాలకు డిమాండ్ ఎలా ఉందో స్పష్టమైంది. హిందీ బెల్ట్‌లో భారీగా కలెక్షన్లు రాబట్టడం పుష్ప 2 ప్రత్యేకత. మొదటి వారమే కాదు, రెండవ వారంలో కూడా హిందీ వెర్షన్ అత్యధిక వసూళ్లు సాధించడం విశేషం.

హిందీలోని ఈ స్థాయి వసూళ్లు చూసి ట్రేడ్ విశ్లేషకులు షాక్ అయ్యారు. ఇప్పటివరకు రెండు వారాల్లో రూ. 1450.13 కోట్ల గ్రాస్‌ను అందుకోవడంతో, ఇది టాలీవుడ్‌లోనే కాకుండా ఇండియన్ సినిమా చరిత్రలో గర్వించదగ్గ సినిమాగా నిలిచిందని చెప్పవచ్చు. ఇక మూడవ వారం క్రిస్టమస్ హాలిడేస్ ను కూడా ఈ సినిమా చల్లగా ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తోంది.

14 రోజుల పుష్ప 2: ది రూల్ వసూళ్లు ఇలా ఉన్నాయి

మొదటి రోజు - 282.91 కోట్లు

2వ రోజు - 134.63 కోట్లు

3వ రోజు - 159.27 కోట్లు

4వ రోజు - 204.52 కోట్లు

5వ రోజు - 101.35 కోట్లు

6వ రోజు - 80.74 కోట్లు

7వ రోజు - 69.03 కోట్లు

8వ రోజు - 54.09 కోట్లు

9వ రోజు - 49.31 కోట్లు

10వ రోజు - 82.56 కోట్లు

11వ రోజు - 104.24 కోట్లు

12వ రోజు - 45.01 కోట్లు

13వ రోజు - 42.63 కోట్లు

14వ రోజు - 39.75 కోట్లు

టోటల్ - 1450.13 కోట్లు