Begin typing your search above and press return to search.

నార్త్ అమెరికాలో పుష్ప 2 బిజినెస్… నెవ్వర్ బిఫోర్

ఇదిలా ఉంటే పుష్ప 2 మూవీ డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 270 కోట్లకి కొనుగోలు చేసిందని టాక్.

By:  Tupaki Desk   |   9 Oct 2024 9:25 AM GMT
నార్త్ అమెరికాలో పుష్ప 2 బిజినెస్… నెవ్వర్ బిఫోర్
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’ డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ ఇండియాలో అయితే ఈ మూవీ రిలీజ్ కోసం ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీపైన భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ఇదిలా ఉంటే పుష్ప 2 మూవీ డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 270 కోట్లకి కొనుగోలు చేసిందని టాక్.

ఇక మూవీ థీయాట్రికల్ బిజినెస్ అత్యదిక స్థాయిలో జరిగిందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో ఈ సినిమా రైట్స్ కి భారీ డిమాండ్ ఉందంట. థీయాట్రికల్ లెక్కలు నిజం అయితే ఇండియాలోనే అత్యధిక ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిన చిత్రంగా ‘పుష్ప 2’ మూవీ రికార్డ్ సృష్టించబోతోందని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే ఈ మూవీ యూఎస్ఏ డీల్స్ గురించి ప్రస్తుతం ఇంటరెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.

యూఎస్ఏలో ఈ సినిమా 15 మిలియన్ డాలర్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ కానుందంట. రిఫండబుల్ బేసిస్ లో యూఎస్ఏ లో ‘పుష్ప 2’ సినిమాపై ఈ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అంటే ఈ సినిమాకి 15 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ రాకుంటే వచ్చిన నష్టాన్ని నిర్మాతలు తిరిగి డిస్టిబ్యూటర్ కి చెల్లించాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో మాట్లాడుకొని రైట్స్ ని భారీ ధరకి అమ్మారని టాక్ వినిపిస్తోంది. రిఫండబుల్ ఫార్మాట్ లో అయితే డిస్టిబ్యూటర్స్ ఎన్ని కోట్లు అయిన కొనడానికి వెనుకాడరు.

ఎందుకంటే ఒక నష్టం వస్తే ఆ మొత్తాన్ని నిర్మాతలు తిరిగి చెల్లిస్తారు. అయితే మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. పుష్ప 2 తెలుగు వెర్షన్ కి తక్కువ మొత్తం వచ్చిన హిందీ వెర్షన్ కి మాత్రం ఓవర్సీస్ లో భారీ కలెక్షన్స్ రావడం గ్యారెంటీ అని భావిస్తున్నారు. ఈజీగా ఆర్ఆర్ఆర్ మూవీ ఓవర్సీస్ కలెక్షన్స్ రికార్డ్ ని పుష్ప 2 బ్రేక్ చేస్తుందని నమ్మకంగా ఉన్నారు. అందుకే 15 మిలియన్ డాల్లర్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో సినిమా బిజినెస్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

ఇక 200 నుంచి 300 కోట్ల మధ్యలో పుష్ప హిందీ వెర్షన్ థీయాట్రికల్ రైట్స్ ని నార్త్ ఇండియాలో అమ్మినట్లు టాక్ వినిపిస్తోంది. ఓవరాల్ గా ‘పుష్ప 2’ మూవీ పైన 800 కోట్ల వరకు బిజినెస్ ప్రీరిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. ఆల్ మోస్ట్ అన్ని చోట్ల రిఫండబుల్ ఫార్మాట్ లోనే బిజినెస్ డీల్స్ క్లోజ్ చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.