పుష్ప 2.. ఆ ఒక్కటి హాలీవుడ్ ను కదిలుస్తుందా?
ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమాలోని క్లైమాక్స్ ఫైట్ కూడా ఇంటర్నేషనల్ మీమ్స్ పేజీలని ఎట్రాక్ట్ చేసిందంట.
By: Tupaki Desk | 4 Feb 2025 7:12 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఐకానిక్ మూవీ ‘పుష్ప 2’ వరల్డ్ వైడ్ గా 1860 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకొని చాలా ఏరియాల్లో ‘బాహుబలి 2’ రికార్డ్ ని బ్రేక్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాకి హిందీలో అద్భుతమైన ఆదరణ లభించింది. అయితే తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ క్రాస్ చేసినప్పటికి భారీ లాభాలు అయితే ఈ చిత్రానికి రాలేదు. కానీ హిందీ బెల్ట్ లో అంచనాలకి మించి మూవీని ప్రేక్షకులు ఆదరించారు.
ముఖ్యంగా అల్లు అర్జున్ మాసివ్ పెర్ఫార్మెన్స్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇదిలా ఉంటే ఈ మూవీ రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ ఏకంగా 250 కోట్లకి పుష్ప డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేసింది. థియేటర్స్ లో ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో నెట్ ఫ్లిక్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఓటీటీలో కూడా వ్యూవ్స్ పరంగా ‘పుష్ప 2’ రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అని నమ్ముతున్నారు
నెట్ ఫ్లిక్స్ లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి అద్భుతమైన ప్రేక్షకాదరణ లభించింది. ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఈ చిత్రం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఇతర దేశాల వారు ఓటీటీలో ఈ చిత్రాన్ని విపరీతంగా వీక్షించారు. హాలీవుడ్ టెక్నీషియన్స్, డైరెక్టర్స్, యాక్టర్స్ కూడా ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో వీక్షించడమే కాకుండా రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ పై ప్రశంసలు కురిపించారు.
నాటు నాటు పాటతో పాటు ఇంటర్వెల్ ముందు వచ్చే యానిమల్ ఉపయోగించుకొని ఎన్టీఆర్ చేసే ఫైట్ అందరికి బాగా కనెక్ట్ అయ్యింది. ఇంటర్నేషనల్ మీమ్స్ పేజీలు ఏ సీక్వెన్స్ ని సోషల్ మీడియాలో విపరీతంగా ఉపయోగించుకున్నాయి. దీంతో సినిమాకి ఇంటర్నేషనల్ లెవల్ లో బ్రాండింగ్ లేచింది. ఈ క్రేజ్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ అంతర్జాతీయ అవార్డులు అందుకోవడానికి కారణం అయ్యింది.
ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమాలోని క్లైమాక్స్ ఫైట్ కూడా ఇంటర్నేషనల్ మీమ్స్ పేజీలని ఎట్రాక్ట్ చేసిందంట. ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో ఏ సినిమాలో కూడా ఈ రకమైన ఫైట్ సీన్ రాలేదని తెలుస్తోంది. దీంతో మార్వెల్ సిరీస్ తో ఈ ఎపిసోడ్ ని కంపారిజన్ చేస్తున్నారు. అలాగే బన్నీ పెర్ఫార్మెన్స్ కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందంట.
ఈ బజ్ మరింత పెరిగితే కచ్చితంగా ‘ఆర్ఆర్ఆర్’ తరహాలోనే ‘పుష్ప 2’ కూడా నెట్ ఫ్లిక్స్ లో రికార్డ్ స్థాయిలో వ్యూవర్ షిప్ సొంతం చేసుకోవడం గ్యారెంటీ అనుకుంటున్నారు. అయితే ఒక్క ఫైట్ సీన్ కారణంగా హాలీవుడ్ ని కదిలిచడం అనేది సులువైన విషయం కాదు. RRR లో డ్యాన్స్ తో పాటు ఇంటర్వెల్ ఫైట్, క్లయిమాక్స్ ఎపిసోడ్ బాగా హైలెట్ అయ్యాయి. ఇక పుష్ప 2లో హై లెవెల్ సీన్ అంటే చివరి ఫైట్. ఇది మాత్రమే కాస్త ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇక దీంతో ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి. ఇక ఇంటర్నేషనల్ స్థాయిలో మూవీకి హైప్ క్రియేట్ అయితే అంతర్జాతీయ అవార్డుల కోసం పోటీ పడొచ్చనే మాట వినిపిస్తోంది. మరి ‘ఆర్ఆర్ఆర్’ తరహాలో ‘పుష్ప 2’ కూడా ఏమైనా అద్భుతాలు క్రియేట్ చేస్తుందా అనేది వేచి చూడాలి.