పుష్ప 2 - ఎక్స్ ట్రా బూస్ట్ ఎప్పుడు?
ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
By: Tupaki Desk | 5 Jan 2025 6:58 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 1800 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకొని ‘బాహుబలి 2’ రికార్డ్ ని క్రాస్ చేసింది. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రాల జాబితాలో ‘పుష్ప 2’ టాప్ లిస్ట్ లో ఉంది. అంచనాలకి మించి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపించడం విశేషం. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా నాలుగు వారాలు కంప్లీట్ చేసుకొని ఐదో వారంలో అడుగుపెడుతోంది. జనవరి నెలలో కూడా ఈ సినిమాపై పబ్లిక్ ఇంటరెస్ట్ ని పెంచే ప్రయత్నం మేకర్స్ చేస్తున్నారు. అందులో భాగంగా సినిమాలో కొత్తగా 18 నిమిషాల అవుట్ ఫుట్ ని యాడ్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎడిటింగ్ రూమ్ లో కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.
అయితే అది ఎప్పుడు యాడ్ చేస్తారనే దానిపై మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. చాలా రోజుల నుంచి దీనిపై చర్చ నడుస్తోంది. ఇప్పటికే థియేటర్స్ లో ప్రేక్షకుల రెస్పాన్స్ ఆల్ మోస్ట్ తగ్గిపోయింది. ఓటీటీలోకి ఎనిమిది వారాల గడుపు తర్వాత రానుంది. ఓటీటీ వెర్షన్ కోసం 18 నిమిషాల నిడివి ఉన్న సీక్వెన్స్ లని మూవీకి అదనంగా యాడ్ చేస్తారా లేదంటే థియేటర్ ప్రింట్ కి జోడిస్తారా అనే దానిపై ఎలాంటి అప్డేట్ లేదు. ఈ 18నిమిషాల అవుట్ ఫుట్ జోడిస్తే సినిమాకి మరల కొత్తదనం వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
కచ్చితంగా మరల ఆడియన్స్ పెరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఒకవేళ థియేటర్ ప్రింట్ కి అదనంగా కంటెంట్ ని జోడిస్తే మూవీకి ఎంతో కొంత ప్లస్ అవితుందని మేకర్స్ కూడా అనుకుంటున్నారు. మరికొద్ది రోజులు థియేటర్స్ లో సినిమాని కొనసాగించి ఆడియన్స్ ని రప్పించవచ్చని భావిస్తున్నారు. ఇక ఆ 18 నిమిషాల నిడివి ఉన్న కథ ఏంటనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ కూడా ఫ్యాన్స్ కి ఉంది.
మేకర్స్ నుంచి దీనిపై సాలిడ్ అప్డేట్ కోరుకుంటున్నారు. అయితే సంధ్య థియేటర్ ఘటన తర్వాత పుష్ప 2 ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ అండ్ టీమ్ అంతా సైలెంట్ అయిపోయారు. ఫ్యాన్స్ కి ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. మరి సంక్రాంతి ఫెస్టివల్ దగ్గర పడుతున్న వేళ సినిమాకి మరల బూస్టింగ్ ఇవ్వడానికి ఇకపై ఏమైనా మేకర్స్ కొత్త అడియాలతో వస్తారేమో అనేది చూడాలి. ఒకవేళ సంక్రాంతి టైమ్ లో నిడివి పెంచగలిగే ఎక్స్ ట్రా సీన్స్ యాడ్ చేస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా మరికొన్ని రోజులు కొనసాగే ఛాన్స్ ఉంది.