Begin typing your search above and press return to search.

పుష్ప 2… ఓవర్సీస్ లెక్క ఏ రేంజ్ లో ఉందంటే..

భారీ అంచనాల మధ్యలో రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ ని మొదటి రోజు వసూళ్లు చేస్తుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   1 Dec 2024 5:21 AM GMT
పుష్ప 2… ఓవర్సీస్ లెక్క ఏ రేంజ్ లో ఉందంటే..
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’పైన దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. అలాగే ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి ఇండియన్ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని తెలుస్తోంది. ‘పుష్ప 2’ మూవీ ప్రీమియర్ షోకి జరుగుతోన్న అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఓవర్సీస్ ట్రెండ్ కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలలో వినిపిస్తోన్న మాట. భారీ అంచనాల మధ్యలో రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ ని మొదటి రోజు వసూళ్లు చేస్తుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ‘పుష్ప 2’ మూవీ ప్రీమియర్ షోలకి అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. రిలీజ్ కి ఇంకా నాలుగు రోజులు సమయం ఉంది. ఇప్పటి వరకు ప్రీమియర్ షోల టికెట్ బుకింగ్స్ ద్వారా 1.90 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ క్రాస్ అయ్యాయనే మాట వినిపిస్తోంది. ఓవరాల్ గా 3726 ప్రీమియర్ షోలు పడబోతున్నాయంట. రిలీజ్ రోజుకి ఈ ప్రీ టికెట్ సేల్ ద్వారా 2.75 మిలియన్ డాలర్స్ నుంచి 3 మిలియన్ డాలర్స్ వరకు కలెక్షన్స్ రావొచ్చని అనుకుంటున్నారు.

అలాగే మంగళవారం నాటికి ప్రీమియర్ షోలు పడే స్క్రీన్స్ సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. యూఎస్ లో 990 లొకేషన్స్ లో మొత్తం 3,635 షోలు పడబోతున్నాయి. వీటికి ఇప్పటి వరకు 62,771 టికెట్స్ బుక్ అయ్యాయి. వీటి ద్వారా $1,778,798 కలెక్షన్స్ వచ్చాయి. ఇక కెనడాలో 23 లొకేషన్స్ లో 91 షోలు పడబోతున్నాయి. వీటిలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 4,804 టికెట్లు అమ్ముడయ్యాయి. వీటి ద్వారా $130,576 కలెక్షన్స్ వచ్చాయి.

ఈ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ‘పుష్ప 2’కి ఓవర్సీస్ లో ఏ స్థాయిలో ఆదరణ లభిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఇదే ట్రెండ్ కొనసాగితే కచ్చితంగా ప్రీమియర్ షోల ద్వారానే 3 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని ఈ మూవీ అందుకొని రికార్డ్ క్రియేట్ చేస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ ఏడాది పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ‘కల్కి 2898ఏడీ’, ‘దేవర’ సినిమాల ప్రీమియర్ షోలకి కూడా ఇదే స్థాయిలో ఆదరణ వచ్చింది.

‘పుష్ప 2’కి కూడా నెక్స్ట్ లెవల్ లో రెస్పాన్స్ వస్తోంది. ఇక ఇండియాలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన నేపథ్యంలో మొదటి రోజు భారీ వసూళ్లు అందుకోవడం గ్యారెంటీ అని మేకర్స్ అంచనా వేస్తున్నారు. అల్లు అర్జున్ కి కూడా ఈ సినిమా చాలా ప్రెస్టీజియస్ గా మారింది. దీంతో పాన్ ఇండియా రేంజ్ లో స్ట్రాంగ్ మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. దానికి ఈ చిత్రం ఏ మేరకు హెల్ప్ అవుతుందనేది చూడాలి.