ఇప్పుడు నైజాం కింగ్ పుష్ప రాజ్
ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భారీ కలెక్షన్లు సాధించగా, నైజాంలో తొలి రోజు కలెక్షన్లు టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులను నమోదు చేశాయి.
By: Tupaki Desk | 6 Dec 2024 8:27 AM GMTపాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్‌తో విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప 2: ది రూల్" మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భారీ కలెక్షన్లు సాధించగా, నైజాంలో తొలి రోజు కలెక్షన్లు టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులను నమోదు చేశాయి.
నైజాంలో ప్రత్యేకంగా ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చిత్రానికి మరింత ఊపును అందించింది. టికెట్ ధరల భారీ పెంపు, స్పెషల్ ప్రీమియర్ షోల ద్వారా మొదటి రోజే సినిమా అంచనాలను దాటి ఆల్‌టైమ్ రికార్డును సృష్టించింది. తొలి రోజు నైజాంలో మాత్రమే రూ. 25 కోట్లకు పైగా షేర్ సాధించడం ఈ సినిమా స్థాయి, క్రేజ్‌కి నిదర్శనం అని చెప్పవచ్చు. అల్లు అర్జున్ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ చరిత్రలోనే ఈ సినిమా ఆల్ టైమ్ బెస్ట్ నైజాం ఓపెనింగ్స్ అందుకుంది.
ఇంతకుముందు నైజాంలో "ఆర్ ఆర్ ఆర్" మూవీ మొదటి రోజు రూ. 23.35 కోట్ల షేర్‌తో రికార్డు సాధించగా, "పుష్ప 2" ఆ రికార్డును అధిగమించింది. స్పెషల్ ప్రీమియర్ షోలు, టికెట్ ధరల పెంపుతో కలిపి ఈ కలెక్షన్లను సాధించిందని చెప్పాలి. ఈ రికార్డు టాలీవుడ్ చరిత్రలో బిగ్గెస్ట్ రికార్డ్ గా నిలిచిపోతుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సినిమా విడుదలకు ముందు నుంచే నైజాంలో టికెట్ ధరలపై భారీ హైప్ ఉండటమే కాకుండా, బుకింగ్స్ కూడా భారీ స్థాయిలో సాగాయి. మొదటి రోజు వసూళ్లు అందించిన తీరును చూస్తే, ఈ సినిమా రాబోయే రోజుల్లో కూడా మరిన్ని రికార్డులను బద్దలుకొడుతుందని స్పష్టంగా తెలుస్తోంది. పుష్ప 2 చిత్రానికి నైజాంలో దక్కిన ఆదరణను దృష్టిలో ఉంచుకుని, సినిమాను ఆ ప్రాంతంలో ప్రేక్షకులు ఎలా స్వాగతించారో చెప్పడం కష్టం.
భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, దేవి శ్రీ ప్రసాద్ అందించిన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అల్లు అర్జున్ పవర్‌పుల్ పెర్ఫార్మెన్స్ చిత్రాన్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. ఇకపోతే, "పుష్ప 2" నైజాంలో సాధించిన ఈ రికార్డు భవిష్యత్తులో ఏ సినిమా కొట్టగలదు? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ స్థాయిలో వచ్చిన ఓపెనింగ్స్‌ను దాటి, రాబోయే సినిమాలు సరికొత్త రికార్డులు నెలకొల్పడం అంత ఈజీ కాదు. ఇక అది ఎంత వరకు సాధ్యమవుతుందో వేచిచూడాలి. ఫైనల్ గా అనుకున్నట్లే పుష్ప రాజ్ ద్వారా అల్లు అర్జున్ నైజాం గడ్డపై నెంబర్ వన్ జెండా రికార్డ్ అందుకోవడం విశేషం.