పిక్‌టాక్ : పుష్ప 2 కట్టింగ్స్ కంప్లీట్
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
By: Tupaki Desk | 28 Nov 2024 6:59 AM GMTఅల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడికి రెడీ అయింది. ఈ సినిమా కోసం నిన్న మొన్నటి వరకు దర్శకుడు సుకుమార్ వర్క్ చేస్తూనే ఉన్నారు. చివరి నిమిషం వరకు షూటింగ్ చేస్తూనే ఉన్న దర్శకుడు సుకుమార్ ఎట్టకేలకు ఎడిటింగ్ వర్షన్ పూర్తి చేయడం జరిగింది. సెన్సార్ కార్యక్రమాల కోసం ఎడిటింగ్ కాస్త హడావుడిగా చేయించాడు. ప్రముఖ ఎడిటర్ నవీన్ నూలితో ఈ సినిమా ఎడిటింగ్ చేయించడం జరిగింది అంటూ మేకర్స్ ప్రకటించారు.
తాజాగా దర్శకుడు సుకుమార్ ఎడిటింగ్ వర్క్ పూర్తి అయింది అంటూ తన ఎడిటర్ నవీన్ నూలితో కలిసి ఒక ఫోటోను దిగాడు. ఈ ఫోటో సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పలు అవార్డులను సొంతం చేసుకున్న ఎడిటర్ నవీన్ నూలి కచ్చితంగా పుష్ప 2 కి తన బెస్ట్ ఇచ్చి ఉంటాడనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. టెక్నీషియన్ ఎవరు అయినా తనకు కావాల్సిన విధంగా వారి నుంచి ఔట్ పుట్ తీసుకోవడంలో సుకుమార్ మాస్టర్ మైండ్ అనడంలో సందేహం లేదు. ట్యాలెంటెడ్ అయిన నవీన్ నూలి నుంచి కచ్చితంగా బెస్ట్ వర్క్ ను సుకుమార్ తీసుకుని ఉంటారు.
పుష్ప 2 సినిమా నిడివి మూడు గంటల ఇరవై నిమిషాలకు పైగా ఉంది. దాంతో కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టించే అవకాశం ఉందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ అలాంటిది ఏమీ ఉండదు అని, కచ్చితంగా ప్రతి ఒక్కరు మెచ్చే విధంగా, నచ్చే విధంగా సినిమా ఉంటుంది అనే విశ్వాసంను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పుష్ప 2 సినిమా రన్ టైమ్ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతున్న సమయంలో దర్శకుడు సుకుమార్ ఇలా ఎడిటర్ నవీన్ నూలితో దిగిన ఈ ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో సుకుమార్ ఈ సినిమా ఎడిటింగ్ విషయంలో చాలా సంతృప్తి చెందారు అని అర్థం చేసుకోవచ్చు.
అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శ్రీలీల చేసిన ఐటెం సాంగ్ చాలా స్పెషల్‌గా నిలుస్తుందని అంటున్నారు. రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.2000 కోట్ల వసూళ్లు నమోదు చేసి దంగల్, బాహుబలి 2 వసూళ్లను బ్రేక్ చేస్తుంది అనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. మూడు గంటలకు పైగా సినిమా ఉంది అంటే ఫలితం కాస్త అటు ఇటు అయినా చాలా పెద్ద దెబ్బ పడుతుంది. అయినా తన కంటెంట్‌పై నమ్మకంతో దర్శకుడు సుకుమార్ ఈమధ్య కాలంలో మరే సినిమా రానంత నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇది ఎంత వరకు ఫలితాన్ని ఇస్తుంది అనేది చూడాలి.