టాప్ 1 లో పుష్ప 2.. బాలీవుడ్ లో మాస్ జాతర..!
అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ వసూళ్లు రాబడుతుంది. సినిమా మొదటి రోజే 295 కోట్లు, రెండు రోజుల్లో 500 కోట్లు దాకా వసూళ్లను రాబట్టింది.
By: Tupaki Desk | 8 Dec 2024 10:32 AM GMTఅల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ వసూళ్లు రాబడుతుంది. సినిమా మొదటి రోజే 295 కోట్లు, రెండు రోజుల్లో 500 కోట్లు దాకా వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా బాలీవుడ్ లో పుష్ప 2 సెన్సేషనల్ రికార్డ్ అందుకుంది. సినిమా మొదటి రోజు 72 కోట్లు రాబట్టగా రెండో రోజు 59 కోటులు మూడవ రోజు మొదటి రెండో రోజు కన్నా ఎక్కువగా 79 కోట్లు ఇలా 3 రోజుల్లోనే 205 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి నెవర్ బిఫోర్ రికార్డులను సృష్టించింది పుష్ప 2.
బాలీవుడ్ లో ఆల్ టైం రికార్డ్ సృష్టించింది పుష్ప 2.. ఇదివరకు ఏ సినిమా కూడా 3 రోజుల్లో ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టలేదు. ఇక బాలీవుడ్ లో ఫస్ట్ 3 డేస్ హైయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమా లిస్ట్ చూస్తే.. పుష్ప 1 హిందీ వెర్షన్ 205 కోట్లు.. రెండో ప్లేస్ లో జవాన్ 180.45 కోట్లు, థర్డ్ యానిమల్ 176.58 కోట్లు, నలుగో ప్లేస్ లో 161 కోట్లు. ఐదో ప్లేస్ టైగర్ 3 144.50 కోట్లు. ఆరో ప్లేస్ కె.జి.ఎఫ్ 2 143.64 కోట్లు, ఏడో ప్లేస్ లో స్త్రీ 2 136.40 కోట్లు, ఎనిమిదవ ప్లేస్ లో గదర్ 2 134.88 కోట్లు, తొమ్మిదవ ప్లేస్ లో బాహుబలి 128 కోట్లు, 10వ ప్లేస్ లో సంజు 120.06 కోట్లు రాబట్టాయి.
బాలీవుడ్ హైయెస్ట్ కలెక్షన్స్ ఇన్ 3 డేస్ లో టాప్ ప్లేస్ లో పుష్ప 2 ఉండగా బాహుబలి 2 తొమ్మిదవ ప్లేస్ లో ఉంది. పుష్ప 2 ముందు నుంచి హిందీ లో బజ్ క్రియేట్ చేయగా సినిమాకు బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగింది. సినిమాకు వచ్చిన టాక్ తెస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే హిందీ బెల్ట్ నుంచే 800 కోట్ల పైన రాబట్టేలా ఉంది. సినిమా తప్పకుండా 1000 కోట్లు ఈజీగా దాటేసేలా ఉంది.
పుష్ప 2 బాక్సాఫీస్ దూకుడు అదిరిపోతుంది. సినిమాకు ఊహించిన దాని కన్నా ఎక్కువ కలెక్షన్స్ వచ్చేలా ఉన్నాయి. ఈ సినిమా నేషనల్ వైడ్ గా సృష్టిస్తున్న సంచలనాలు చూసి ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు. పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించి బాక్సాఫీస్ పై తన స్టామినా చూపిస్తున్నాడు.