Begin typing your search above and press return to search.

'పుష్ప 2' అస్సలు తగ్గేదేలే.. రిలీజ్ కు ముందే వైల్డ్‌ఫైర్‌ రికార్డ్స్!

మూడేళ్ళ క్రితం 'పుష్ప 1'లో 'తగ్గదేలే' అంటూ వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు సెకండ్ పార్ట్ తో 'అస్సలు తగ్గేదేలే' అంటూ వస్తున్నారు.

By:  Tupaki Desk   |   2 Dec 2024 1:53 PM GMT
పుష్ప 2 అస్సలు తగ్గేదేలే.. రిలీజ్ కు ముందే వైల్డ్‌ఫైర్‌ రికార్డ్స్!
X

యావత్ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూసిన ''పుష్ప 2'' సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. మూడేళ్ళ క్రితం 'పుష్ప 1'లో 'తగ్గదేలే' అంటూ వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు సెకండ్ పార్ట్ తో 'అస్సలు తగ్గేదేలే' అంటూ వస్తున్నారు. గత కొన్ని రోజులుగా పుష్ప ఫీవర్ కొనసాగుతోంది. ఎక్కడ చూసినా పుష్ప మ్యానియానే కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చేస్తుంటే 'పుష్ప: ది రూల్‌' సినిమా వరల్డ్ బాక్సాఫీస్‌ను రూల్‌ చేస్తుందని అర్థమవుతోంది. డిసెంబర్ 5న పుష్పరాజ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో, రిలీజ్ కు ముందే ‘పుష్ప-2’ క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

* 'పుష్ప: ది రూల్‌' సినిమా సినిమాను ప్రపంచవ్యాప్తంగా 12,00+ స్క్రీన్స్‌లో 6 భాషల్లో (తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ) విడుదల చేయనున్నారు. ఇది ఇండియన్‌ సినిమాలో బిగ్గెస్ట్‌ రిలీజ్ గా రికార్డు సృష్టించింది.

* ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ లో అత్యంత వేగంగా 50 వేల టికెట్స్ అమ్ముడైన సినిమాగా 'పుష్ప 2: ది రూల్‌' రికార్డ్ క్రియేట్ చేసింది.

* నార్త్ అమెరికాలో టికెట్ల ప్రీసేల్స్ ద్వారా అత్యంత వేగంగా 1 మిలియన్‌ డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసిన మూవీగా 'పుష్ప 2' నిలిచింది.

* ఓషియానియాలో ప్రీసేల్స్ ద్వారా $700K వసూలు చేసిన ఫస్ట్ ఇండియన్ సినిమాగా 'పుష్ప 2' రికార్డు నెలకొల్పింది. (పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపాల్లోని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీ లాంటి 14 దేశాలను కలిపి ఓషియానియాగా పిలుస్తారు)

* 'పుష్ప 2: ది రూల్' కేరళ బాక్సాఫీస్‌ వద్ద 12 గంటల్లోపే అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ ద్వారా రూ. 1 కోటికి పైగా కలెక్షన్స్ నమోదు చేసిన తెలుగు సినిమాగా ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది.

* హిందీ వెర్షన్‌ అడ్వాన్స్ బుకింగ్స్ లో 24 గంటల్లోనే 1 లక్ష టికెట్స్‌ అమ్ముడైన బాలీవుడ్ ఆల్‌ టైమ్‌ టాప్ మూవీస్ లిస్ట్‌లో ‘పుష్ప 2’ మూడో స్థానంలో నిలిచింది.

* పేటీయం యాప్ లో 2.6 మిలియన్ల మంది 'పుష్ప 2’ సినిమా పట్ల ఆసక్తి కనబరిచారు. ఏ భారతీయ సినిమాకైనా ఇదే హయ్యెస్ట్. ఇక బుక్‌ మై షో యాప్ లో 1.8 మిలియన్స్ ఈ సినిమా పట్ల ఇంట్రెస్ట్ చూపించడం విశేషం.

* ట్రేడ్‌ వర్గాల అంచనా ప్రకారం 'పుష్ప 2’ చిత్రం ఫస్ట్ డే రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో, హయ్యెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు.

* ‘పుష్ప 2: ది రూల్’ ట్రైలర్‌ అత్యంత వేగంగా 150 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుని రికార్డ్ నెలకొల్పింది. అలానే 15 గంటలలోపే 40 మిలియన్ల వ్యూస్ అందుకున్న ఫస్ట్‌ సౌతిండియా మూవీ ట్రైలర్‌గా నిలిచింది.

* ‘పుష్ప 2’ సినిమాలోని ఐటెం సాంగ్ 'కిస్సిక్'.. అత్యంత వేగంగా 18 గంటల్లోనే 25+ మిలియన్‌ వ్యూస్‌ సాధించిన సౌత్ సినిమా సాంగ్ గా రికార్డు సృష్టించింది.

* పాట్నాలో జరిగిన ‘పుష్ప 2’ వైల్డ్‌ఫైర్‌ ఈవెంట్‌.. హైయెస్ట్‌ లైవ్‌ వ్యూవర్స్‌ నమోదైన తొలి ఈవెంట్‌గా నిలిచింది.

* హైదరాబాద్ లో జరిగే 'పుష్ప 2' వైల్డ్ ఫైర్ జాతర ఈవెంట్ కోసం 1000 మంది పోలీసులతో బందోబస్త్ ఏర్పాటు చేసారు. తెలుగులో ఒక సినిమా ఈవెంట్ కు ఇంతమంది పోలీసులు సెక్యూరిటీగా రావడం ఇదే మొదటిసారి.

* 'పుష్ప 2: ది రూల్' మూవీని థియేటర్ లో ఏ భాషలో ప్రదర్శించినా, సినీ డబ్స్ అనే యాప్ ద్వారా మీకు నచ్చిన భాషలో చూసే కొత్త విధానానికి శ్రీకారం చుడుతున్నారు.