పుష్ప 2 ఫస్ట్ డే రికార్డ్‌కి వాళ్లే కీలకం..!
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
By: Tupaki Desk | 1 Dec 2024 5:58 AM GMTఅల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్ 4 రాత్రి 9.30కి ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. అలాగే డిసెంబర్ 4వ తారీకునే యూఎస్‌తో పాటు పలు దేశాల్లో స్క్రీనింగ్ మొదలు కాబోతుంది. ఉత్తర భారతంలో మాత్రం ఈ సినిమా డిసెంబర్ 5వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల హిందీ పుష్ప 2 కోసం అడ్వాన్స్ బుకింగ్ మొదలు అయింది. పుష్ప 2 సినిమాకు హిందీ ప్రేక్షకుల్లో అంచనాలు, ఆసక్తి ఎలా ఉంది అనేది ఇప్పటికే నమోదు అయిన అడ్వాన్స్ బుకింగ్‌తో తేలిపోయింది.
పుష్ప 2 సినిమా హిందీ వర్షన్ అడ్వాన్స్ బుకింగ్ మొదలు అయిన కొన్ని నిమిషాల్లోనే బుక్ మై షో ద్వారా పది వేల టికెట్లు అమ్ముడు పోయాయి. ఆన్ లైన్ ద్వారా మాత్రమే కాకుండా ఆఫ్ లైన్ ద్వారా థియేటర్ల వద్దకు వెళ్లి క్యూలో నిల్చుని మరీ పుష్ప 2 సినిమా టికెట్లను హిందీ ప్రేక్షకులు తీసుకున్నారు. 24 గంటలు పూర్తి కాకుండానే రికార్డ్ స్థాయిలో పుష్ప 2 హిందీ టికెట్లు అమ్ముడు పోయాయి అంటూ డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. బాహుబలి 2, కేజీఎఫ్ 2 అడ్వాన్స్ బుకింగ్స్‌ను క్రాస్ చేసి మరీ పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ దక్కాలి అంటే కచ్చితంగా సినిమా నార్త్‌లో భారీ ఓపెనింగ్స్ రాబట్టాల్సి ఉంది. ముఖ్యంగా మొదటి రోజు సినిమా వసూళ్ల విషయానికి వస్తే హిందీ బెల్ట్ నుంచి వచ్చే వసూళ్లు కీలకంగా ఉంటాయి. కనుక అక్కడ అడ్వాన్స్ బుకింగ్ ఎక్కువ జరగాలని మేకర్స్ మొదటి నుంచి అనుకున్నారు. వారు అనుకున్నట్లుగానే భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్ జరుగుతోంది. అనుకున్న దాని కంటే ఎక్కువగానే మొదటి రోజు వసూళ్లు ఉంటాయి అంటూ నిర్మాతలకు నమ్మకం కలిగించే విధంగా నార్త్ ఇండియాతో పాటు సౌత్ ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతున్నాయి.
మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా పుష్ప 2 సినిమా నిలవాలి అంటే కచ్చితంగా హిందీ ప్రేక్షకుల ప్రోత్సాహం చాలా అవసరం. వారి నుంచి పుష్ప 2 కి వస్తున్న ముందస్తు ఆధరణ నేపథ్యంలో సరికొత్త నెంబర్ ఆవిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. పుష్ప 2 మొదటి రోజు వసూళ్ల రికార్డు సంవత్సరాల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్లో ఏ సినిమాకు దక్కని ఓపెనింగ్స్ పుష్ప 2 కి దక్కడంతో పాటు కేవలం హిందీ మార్కెట్లోనే సినిమా లాంగ్ రన్ లో రూ.800 కోట్ల నుంచి రూ.1000 కోట్ల వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకులు, బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.