Begin typing your search above and press return to search.

పుష్ప 2: గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మొదటి రోజు కలెక్షన్లు ఎంతంటే!

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన "పుష్ప 2: ది రూల్" మొత్తానికి ఘనవిజయం సాధించింది.

By:  Tupaki Desk   |   6 Dec 2024 8:40 AM GMT
పుష్ప 2: గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మొదటి రోజు కలెక్షన్లు ఎంతంటే!
X

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన "పుష్ప 2: ది రూల్" మొత్తానికి ఘనవిజయం సాధించింది. ప్రేక్షకుల అంచనాలను అందుకుంటూ, తొలి రోజు నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల మద్దతు పొందుతూ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది. ఆంధ్ర తెలంగాణలో సినిమా దాదాపు ఎన్ని ఏరియాల్లో కూడా ఫస్ట్ డే సాలీడ్ కలెక్షన్లు రాబట్టింది.

గుంటూరు జిల్లాలో ఈ సినిమా మొదటి రోజే రూ. 6.30 కోట్లు (జిఎస్టీతో కలిపి) వసూలు చేయడం విశేషం. గతంలో అల్లు అర్జున్ సినిమాలు ఈ ఏరియాలో అంత కలెక్షన్స్ రాబట్టలేదు. ఒక విధంగా ఆ ప్రాంతంలో సాధారణంగా వచ్చే కలెక్షన్లను దాటి భారీ విజయాన్ని సాధించినట్లుగా చెప్పవచ్చు. ఇదే తరహాలో కృష్ణా జిల్లాలో కూడా సినిమా మంచి వసూళ్లను రాబట్టడం విశేషం.

అక్కడ మొదటి రోజే రూ. 4.4 కోట్లు (జిఎస్టీతో కలిపి) వసూలు చేసింది. ఈ రికార్డులు సినిమా పై ఉన్న మాస్ క్రేజ్‌ను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. చూస్తుంటే సినిమా రాబోయే రోజుల్లో, ముఖ్యంగా వీకెండ్ లో, ఇంకా మంచి వసూళ్లను సాధిస్తుందనేది ట్రేడ్ విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. ప్రస్తుత టికెట్ బుకింగ్స్, థియేటర్లకు వచ్చే ఆడియన్స్ రష్ చూస్తే, కలెక్షన్లను మరింత పెంచుకునే అవకాశం ఉంది.

"పుష్ప 2" లో అల్లు అర్జున్ తో పాటు రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, సునీల్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సినిమా నిర్మాణం విషయంలో మైత్రి మూవీ మేకర్స్ పై కూడా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా నిర్మించారు. సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ కూడా సినిమాకు న్యాయం చేశారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం సామ్ సిఎస్ కూడా తనదైన ముద్ర వేశారు.

ఈ చిత్రంలోని కథ, పాటలు, యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు నటీనటుల పెర్ఫార్మెన్స్ కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే కీలక అంశాలుగా మారాయి. మొదటి భాగం విజయం సాధించడంతో, సీక్వెల్ పై మొదటి నుంచి అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక బాక్సాఫీస్ కలెక్షన్ల పెరుగుదలకు ఆ అంచనాలు గట్టిగానే హెల్ప్ అయ్యాయి. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా తన స్థానాన్ని మరింత స్ట్రాంగ్ గా మార్చుకున్నాడు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సాధించిన వసూళ్లే కాకుండా, దేశవ్యాప్తంగా, అలాగే ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. వసూళ్లు అంచనాలను దాటి, "పుష్ప 2" తెలుగు చిత్రసీమకు గర్వకారణంగా నిలిచిందని అంటున్నారు.