Begin typing your search above and press return to search.

దృష్టి, వినికిడి లోపం ఉన్న వారి కోసం 'పుష్ప 2'..!

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రికార్డ్‌ స్థాయి వసూళ్లు ఈ సినిమా సాధిస్తుంది అనే నమ్మకం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   4 Dec 2024 11:18 AM GMT
దృష్టి, వినికిడి లోపం ఉన్న వారి కోసం పుష్ప 2..!
X

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో రూపొందిన పుష్ప 2 సినిమా సందడి షురూ అయ్యింది. డిసెంబర్‌ 5న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కాబోతున్నా ముందు రోజే యూఎస్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రీమియర్ షోలు వేస్తున్నారు. బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకుంటూ వెళ్తున్న సుకుమార్‌ రూపొందించిన ఈ సినిమా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. పుష్ప 1 భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రికార్డ్‌ స్థాయి వసూళ్లు ఈ సినిమా సాధిస్తుంది అనే నమ్మకం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాను నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్‌ చాలా దూరం తీసుకు వెళ్తున్నారు. పదుల సంఖ్యల థియేటర్‌లలో ఈ సినిమాను విడుదల చేయడంతో పాటు అత్యధిక స్క్రీన్స్‌లో సినిమాను విడుదల చేయబోతున్నారు. దాదాపుగా 12000 స్క్రీన్స్‌లో పుష్ప 2 ను ఆరు విభిన్న భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమాను దృష్టి లోపం ఉన్న వారికి, వినికిడి లోపం ఉన్న వారికి చేరువ చేయడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని మైత్రి మూవీ మేకర్స్‌ వారు అధికారికంగా ప్రకటించారు.

RETA, Moviebuff యాక్సెస్ యాప్‌లతో దృష్టి, వినికిడి లోపం ఉన్న వారు బిగ్‌ స్క్రీన్‌పై పుష్ప 2 ను ఎక్స్‌పీరియన్స్‌ చేయవచ్చు అంటూ అధికారికంగా మైత్రి వారు ప్రకటించారు. ఈ యాప్స్‌లో ఉండే ప్రత్యేక ఏర్పాట్ల వల్ల సినిమాను అందరికీ చేరువ చేసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు పుష్ప 2 ను ఎంజాయ్‌ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ఏర్పాటు చేసినట్లుగా మైత్రి మూవీ మేకర్స్ వారు అధికారికంగా ప్రకటించారు. కచ్చితంగా ఇది చాలా మంచి పరిణామం అంటూ దృష్టి లోపంతో బాధ పడేవారు, వినికిడి సమస్యను ఎదుర్కొనే వారు చెబుతూ ఉన్నారు.

పుష్ప 2 సినిమా వరల్డ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసేందుకు ఇప్పటికే రెడీ అయ్యింది. విడుదలకు ముందే దాదాపుగా రూ.150 కోట్ల అడ్వాన్స్ బుకింగ్‌తో రికార్డ్‌ సృష్టించింది. సినిమా మొదటి రోజు వసూళ్లు ప్రీమియర్‌ షోలతో కలిపి రూ.300 కోట్లకు పైగా ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ స్థాయిలో వసూళ్లు ఇప్పటి వరకు ఇండియన్‌ సినీ చరిత్రలో ఏ సినిమాకు సాధ్యం కాలేదు. పుష్ప 2 సినిమా రికార్డ్‌లు రాబోయే పదేళ్ల పాటు పదిలంగా ఉండే అవకాశాలు ఉన్నాయని బన్నీ ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు.