Begin typing your search above and press return to search.

పుష్ప 2 - గేమ్ ఛేంజ‌ర్ హిందీ హ‌క్కులు అత‌డికే

తెలుగు నుంచి స్ట్రెయిట్ సినిమాలు, హిందీలో భారీ సినిమాల‌ను రిలీజ్ చేసేందుకు త‌డానీల తెలివైన గేమ్ ప్లాన్ ఎల్ల‌పుడూ ఆస‌క్తిని క‌లిగిస్తుంది.

By:  Tupaki Desk   |   2 Oct 2024 6:14 AM GMT
పుష్ప 2 - గేమ్ ఛేంజ‌ర్ హిందీ హ‌క్కులు అత‌డికే
X

తెలుగు నుంచి స్ట్రెయిట్ సినిమాలు, హిందీలో భారీ సినిమాల‌ను రిలీజ్ చేసేందుకు త‌డానీల తెలివైన గేమ్ ప్లాన్ ఎల్ల‌పుడూ ఆస‌క్తిని క‌లిగిస్తుంది. గ‌తంలో ప్ర‌భాస్, ఎన్టీఆర్ సినిమాల‌ను వీరు ప్ర‌ణాళికా బ‌ద్ధంగా రిలీజ్ చేసి సంచ‌ల‌న వ‌సూళ్ల‌కు స‌హ‌క‌రించారు. ఈసారి కూడా తెలుగు, హిందీ అగ్ర హీరోలు అల్లు అర్జున్, రామ్ చ‌ర‌ణ్, కార్తీక్ ఆర్యన్ ల‌కు త‌డానీలు పెద్ద స‌హ‌కారం అందిస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

భూల్ భులయ్యా 2 విజయం తర్వాత కార్తీక్ ఆర్యన్, అనీస్ బాజ్మీ, భూషణ్ కుమార్ `భూల్ భూలయ్యా 3`తో ఫ్రాంచైజీని కొనసాగించడానికి మళ్లీ కలిశారు. మూడవ భాగం హారర్-కామెడీలో విద్యాబాలన్, ట్రిప్తీ డిమ్రీ, మాధురీ దీక్షిత్‌లతో క‌లిసి కార్తీక్ ఆర్యన్ న‌టించ‌డం ఉత్కంఠ రేపుతోంది. దీపావళి 2024 వారాంతంలో ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. టీజర్ ఇటీవలే విడుదలైంది. ఒక వారంలో థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు భూషణ్ కుమార్ `భూల్ భూలయ్యా 3` కోసం అనిల్ తడానిని మేక‌ర్స్ ఎంచుకున్నారని తెలిసింది.

ట్రేడ్ స‌మాచారం మేర‌కు...అనిల్ తడాని భూల్ భుల‌యా 3 కోసం దేశవ్యాప్తంగా ఎగ్జిబిటర్లతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ప్రారంభించాడు. ఈ ఏడాదిలో త‌డానీ కల్కి 2898 AD, దేవర(2024) వంటి భారీ చిత్రాలను పంపిణీ చేసారు. ఇప్పుడు భూల్ భూలయ్యా 3, పుష్ప 2, గేమ్ ఛేంజర్ సినిమాల‌ను పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. AA ఫిల్మ్స్ ద్వారా ఇవి విడుద‌లవుతున్నాయి. భూల్ భూలయ్యా 3 - పుష్ప: ది రూల్ టు సింగిల్ స్క్రీన్‌లు , నాన్-నేషనల్ మ‌ల్టీప్లెక్స్ చైన్‌ల కోసం ఒక జాయింట్ వెంచ‌ర్‌ను ఆఫర్ చేసాడు. ఇది పోటీదారు రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ చిత్రం `సింగం ఎగైన్‌`కు పోటాపోటీగా మంచి ప్రదర్శనను పొందేలా చేస్తుంది అని తెలుస్తోంది.

సరైన థియేట‌ర్ల‌ను లాక్ చేసేందుకు అనిల్ తడాని ఎగ్జిబిటర్లతో మంత‌నాలు సాగిస్తున్నారు. కార్తీక్ ఆర్యన్, అల్లు అర్జున్ చిత్రాలను తెలివిగా ఎగ్జిబిట్ చేసేందుకు ఆయ‌న ప‌ని చేస్తున్నారు. ఈ భారీ చిత్రాల‌ కోసం సాధ్యమైనంత ఉత్తమమైన ఒప్పందాలను కుదుర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. అనిల్ తడాని చాలా చిత్రాలను క్లాష్‌లో విడుదల చేశాడు. అందువ‌ల్ల‌ భూల్ భూలయ్యా 3ని ప్రేక్షకులకు స‌రైన విధంగా అందించడానికి సరైన వ్యూహాలను అనుసరిస్తున్నాడు అని సోర్స్ చెబుతోంది.

సింగం ఎగైన్ వ‌ర్సెస్ భూల్ భూలయ్యా 3 ఎపిసోడ్ తీవ్ర‌మైన పోటీకి సంబంధించిన‌ది. ఈ దీపావళి క్లాష్‌లో బాక్సాఫీస్ ఫలితాన్ని నిర్ణయించడంలో షోకేసింగ్ అనేది పెద్ద పాత్ర పోషిస్తుంది కాబట్టి ఇరు సినిమాల న‌డుమా ముగింపు వరకు థియేట‌ర్ల కోసం పోరాటం చేయాల్సి ఉంటుంది. PVR ఐనాక్స్ సింగం ఎగైన్ ని పంపిణీ చేస్తుంది.