Begin typing your search above and press return to search.

టాప్ డే-1 ఫుట్ ఫాల్స్.. పుష్ప 2ని ఎంతమంది చూశారంటే?

కలెక్షన్లు అందుకున్నప్పటికి సౌత్ దర్శక హీరోలు దేశవ్యాప్తంగా డామినేట్ చేస్తుండడం విశేషం.

By:  Tupaki Desk   |   6 Dec 2024 12:30 PM GMT
టాప్ డే-1 ఫుట్ ఫాల్స్.. పుష్ప 2ని ఎంతమంది చూశారంటే?
X

సినిమా విడుదలైన మొదటి రోజున ఎంతమంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళారన్నది ఆ సినిమాకి వున్న క్రేజ్‌ను సూచిస్తుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు అత్యధిక ఫుట్‌ఫాల్స్ సాధించిన టాప్ సినిమాల జాబితాలో సౌత్ సినిమాలే ఉండడం విశేషం. బాలీవుడ్ లో జవాన్, పఠాన్ సినిమాలు టాప్.కలెక్షన్లు అందుకున్నప్పటికి సౌత్ దర్శక హీరోలు దేశవ్యాప్తంగా డామినేట్ చేస్తుండడం విశేషం. ఇక పుష్ప 2: ది రూల్ రెండో స్థానాన్ని దక్కించుకుని మరో సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది.

మొదటి స్థానంలో బాహుబలి 2: ది కంక్లూజన్ కొనసాగుతోంది. ఇప్పటికీ మొదటి రోజున అత్యధిక ఫుట్‌ఫాల్స్ సాధించిన సినిమా గా నిలిచింది. 2017లో విడుదలైన ఈ పాన్ ఇండియా మూవీ డే 1కి ఏకంగా 1.05 కోట్ల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి అత్యుత్తమ రికార్డును సృష్టించింది. ఇప్పటికీ ఈ రికార్డు ఎవరూ చెరపలేకపోయారు. ఇక ఇప్పుడు పుష్ప 2 ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.

పుష్ప 2 మొదటి రోజున మొత్తం 71 లక్షల మంది ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూశారని గణాంకాలు చెబుతున్నాయి. అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి అద్భుతమైన క్రేజ్ తెచ్చాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుల సంఖ్య సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లపై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.

పుష్ప 2 డే 1కి దేశవ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్లను సాధించినప్పటికీ, ఫుట్‌ఫాల్స్ పరంగా అది బాహుబలి 2 రికార్డును అందుకోలేకపోయింది. అయితే రెండో స్థానంలో నిలవడమే ఈ సినిమా విజయానికి మరో రికార్డ్ అని చెప్పాలి. ఇక మూడో స్థానంలో నిలిచిన కేజీఎఫ్ చాప్టర్ 2 మొదటి రోజున 70 లక్షల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. యష్ పవర్‌, ప్రశాంత్ నీల్ దర్శకత్వం కాంబినేషన్ ఈ సినిమాని భారతీయ బాక్సాఫీస్‌ను దద్దరిలేలా చేసింది. పుష్ప 2 కేజీఎఫ్ 2 రికార్డును తక్కువ తేడాతో అధిగమించింది.

బాహుబలి అనంతరం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR తొలి రోజున 58 లక్షల ఫుట్‌ఫాల్స్‌ను నమోదు చేసింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటనకు ప్రాధాన్యత ఇచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. కానీ పుష్ప 2 డే 1 ఫుట్‌ఫాల్స్‌లో ఈ రికార్డును దాటింది. పుష్ప 2 సాధించిన ఈ ఫుట్‌ఫాల్స్ రికార్డు రాబోయే రోజుల్లో బన్నీ కెరీర్ కు మంచి క్రేజ్ తెస్తుందని చెప్పవచ్చు.