Begin typing your search above and press return to search.

పుష్ప 2.. హిందీలో ఆ ఒక్కటి సాధ్యమేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ ప్రభంజనం అన్ని భాషలలో కూడా కొనసాగుతోంది.

By:  Tupaki Desk   |   27 Dec 2024 8:13 AM GMT
పుష్ప 2.. హిందీలో ఆ ఒక్కటి సాధ్యమేనా?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ ప్రభంజనం అన్ని భాషలలో కూడా కొనసాగుతోంది. క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమాలు ఏవీ కూడా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. మలయాళంలో రిలీజ్ అయిన మార్కో మూవీ మాత్రం పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. మలయాళం, హిందీ భాషలలో ఈ చిత్రం మంచి వసూళ్లు అందుకుంటూ నడుస్తోంది. మిగిలిన సినిమాలు అయితే పెద్దగా ప్రభావం చూపించలేదు.

దీంతో మరల ఆడియన్స్ క్రిస్మస్ హాలిడేస్ లో ‘పుష్ప 2’ చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. మూవీ కలెక్షన్స్ కూడా చాలా డీసెంట్ గా వస్తున్నాయి. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 1700 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం లాంగ్ రన్ లో ‘బాహుబలి 2’ దగ్గరకి వెళ్లిపోయేలా కనిపిస్తోంది. ముఖ్యంగా హిందీలో అయితే ఈ సినిమా జోరు అస్సలు తగ్గలేదు.

భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన వరుణ్ ధావన్ ‘బేబీ జాన్’ మూవీ హిందీలో పెద్దగా ప్రభావం చూపించలేదు. రెండో రోజుకే ఈ సినిమా కలెక్షన్స్ గణనీయంగా డ్రాప్ అయిపోయాయి. ‘పుష్ప 2’ కలెక్షన్స్ కంటే తక్కువ ఈ చిత్రానికి వచ్చాయంటే ఏ స్థాయిలో ఆ సినిమా పట్ల ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

21వ రోజు కూడా ‘పుష్ప 2’ మూవీ 8 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ ని నార్త్ ఇండియాలో వసూళ్లు చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు హిందీలో ఈ మూవీ మరో రికార్డ్ కి చేరువ అవుతున్నట్లు తెలుస్తోంది. కేవలం హిందీలోనే 1000 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన మూవీగా చరిత్ర సృష్టించేందుకు సిద్ధం అవుతోందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా హిందీ వెర్షన్ కలెక్షన్స్ 918 కోట్ల వరకు ఉన్నాయని సమాచారం. ఇదే జోరు మరో వారం రోజుల పాటు హిందీలో కొనసాగితే 1000 కోట్ల మార్కెట్ ని దాటేస్తుంది. ఇప్పటి వరకు షారుఖ్ ఖాన్ ‘జవాన్’, ‘పఠాన్’ సినిమాలు మాత్రమే హిందీ భాషలో 1000 కోట్లు అందుకున్నాయి. ‘దంగల్’ మూవీ ఇండియాలోనే హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా ఉంది.

అయితే ఆ సినిమాకి మెజారిటీ కలెక్షన్స్ చైనా భాషలో వచ్చాయి. హిందీ భాషలో ఆ చిత్రం 1000 కోట్లు దాటలేదు. ‘జవాన్’, ‘పఠాన్’ తర్వాత ‘పుష్ప 2’ మాత్రమే 1000 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అనుకుంటున్నారు. ఒకవేళ ఆ రికార్డ్ క్రియేట్ చేస్తే మాత్రం హిందీ వెర్షన్ తో 1000 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించిన ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీగా ఈ చిత్రం అరుదైన ఫీట్ అందుకుంటుంది.