పుష్ప 2 హిందీ బ్లాస్ట్.. ఆదివారం అంతకుమించి..
పుష్ప 2 విడుదలైన ఫస్ట్ డే నుంచి ఆదివారం వరకు చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డులతో దర్శనమిస్తోంది.
By: Tupaki Desk | 9 Dec 2024 9:05 AM GMTఅల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన 'పుష్ప 2: ది రూల్' హిందీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి, అనేక రికార్డులను తిరగరాసింది. ఆదివారం రోజున ఈ సినిమా ఊహించని స్థాయిలో కలెక్షన్లను నమోదు చేసింది. ఫస్ట్ పార్ట్ అప్పట్లో పెద్దగా ప్రమోషన్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయినప్పటికీ హిందీలో టోటల్ గా 100 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లు వచ్చాయి. కానీ పార్ట్ 2 మాత్రం ఆ రికార్డ్ ను రెండు రోజుల్లోనే క్రాస్ చేయడం విశేషం.
పుష్ప 2 విడుదలైన ఫస్ట్ డే నుంచి ఆదివారం వరకు చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డులతో దర్శనమిస్తోంది. ఆదివారం ఒక్క రోజే రూ. 86 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇది హిందీ సినిమా చరిత్రలో 4వ రోజు అత్యధిక నెట్ కలెక్షన్ల రికార్డు. మాస్ బెల్ట్స్‌లో సినిమా ఆక్యుపెన్సీ అత్యంత ఉత్సాహంగా ఉండటంతో రాబోయే రోజుల్లో లెక్క మరింత ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంది.
ఇక హిందీలో మొత్తం నాలుగు రోజులలో రూ. 291 కోట్లకు చేరుకుని, షారుఖ్ ఖాన్ జవాన్ క్రియేట్ రూ. 249 కోట్ల రికార్డును అధిగమించింది. ఈ సినిమా నాలుగు రోజులలోనే అనేక రికార్డులను తిరగరాసింది. హిందీ వెర్షన్‌లో అన్ని ప్రాంతాల్లో అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్ల రికార్డును సాధించడం గమనార్హం. అలాగే, వరుసగా నాలుగు రోజుల పాటు రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన తొలి చిత్రం గానూ నిలిచింది.
ఈ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ అత్యంత వేగంగా రూ. 250 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాగా కూడా గుర్తింపు పొందింది, ఇక త్వరలోనే రూ. 300 కోట్ల మార్క్‌ను కూడా చేరుకునే అవకాశం ఉంది. హిందీ వెర్షన్ సౌత్ ఇండియాలో చాలా తక్కువ స్క్రీనింగ్ లభించినప్పటికీ, ఈ రికార్డులు సృష్టించడమే సినిమాకు ఉన్న క్రేజ్‌ను హైలెట్ చేస్తోంది. నార్త్ లో చాలా ప్రాంతాల్లో 'పుష్ప 2' అత్యధిక కలెక్షన్ల రికార్డులను తిరగరాయడమే కాకుండా, రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం ఉంది.
ప్రత్యేకంగా ఆదివారం రోజున రూ. 80 కోట్ల మార్క్‌ను దాటడం ఈ సినిమాకు గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. ఈ విజయంతో అల్లు అర్జున్‌ను హిందీ మార్కెట్ లో కూడా ఒక బిగ్ స్టార్‌గా నిలబెట్టింది. ఇక నుంచి ఆయన తీసుకునే సినిమాల ఎంపిక, భవిష్యత్తులో మరింత గొప్ప క్రౌడ్ పులర్‌గా నిలపడానికి కీలక పాత్ర పోషిస్తుంది. 'పుష్ప 2' సినిమాను ఇప్పుడు కేవలం ఒక సినిమాగా కాదు, ఒక ఉద్యమం అని చెప్పుకోవచ్చు.
'పుష్ప 2' సినిమా హిందీ వెర్షన్ కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి:
గురువారం: రూ. 72 కోట్లు
శుక్రవారం: రూ. 59 కోట్లు
శనివారం: రూ. 86 కోట్లు
ఆదివారం: రూ. 86 కోట్లు
మొత్తం కలెక్షన్లు: రూ. 291 కోట్లు
ఈ అరుదైన రికార్డులు తెలుగు సినిమా ప్రతిష్టను దేశవ్యాప్తంగా మరోస్థాయికి తీసుకెళ్లాయి. అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. పుష్ప 2 సృష్టించిన రికార్డులు రాబోయే కాలంలో భారతీయ చిత్ర పరిశ్రమకు మరింత బూస్ట్ ఇవ్వగలవు.