G7లో పుష్ప నయా చరిత్ర.. బీటౌన్ లో ఓ రేంజ్ లో..
ప్రపంచవ్యాప్తంగా 12 వేల స్క్రీన్లలో విడుదల కానున్న పుష్ప 2: ది రూల్ కోసం ఎంతో ఆసక్తిగా అంతా వెయిట్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 30 Nov 2024 6:20 PM GMTపుష్ప-2... ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ మరో ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్ గా కనీవినీ ఎరుగని స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 12 వేల స్క్రీన్లలో విడుదల కానున్న పుష్ప 2: ది రూల్ కోసం ఎంతో ఆసక్తిగా అంతా వెయిట్ చేస్తున్నారు. మరోసారి పుష్పరాజ్ మ్యానియా చూసేందుకు రెడీ అవుతున్నారు.
అయితే ఇప్పటికే ఎన్నో ఘనతలు అందుకున్న పుష్ప-2.. కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ సత్తా చాటుతోంది. నార్త్ లో ఓ రేంజ్ లో అలరిస్తోంది. ఇప్పటి వరకు రూ.3 కోట్లకు పైగా అడ్వాన్స్ వసూళ్లను రాబట్టింది. ఇంకా పూర్తి స్థాయిలో బుకింగ్స్ స్టార్ట్ కాకుండానే.. పుష్ప-2 ఓ రేంజ్ లో దూసుకుపోతోంది.
ఇప్పుడున్న జోష్ ను చూస్తుంటే.. బాలీవుడ్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ ఓపెనర్ గా పుష్ప సీక్వెల్ నిలవనున్నట్లు కనిపిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.65 కోట్ల ఓపెనింగ్స్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ జవాన్ మూవీ రికార్డును పుష్ప-2 బద్దలు కొడుతుందని చెబుతున్నారు.
మరోవైపు, ముంబైలోని ఫేమస్ G7 మల్టీప్లెక్స్ గైటీ- గెలాక్సీ విషయంలో పుష్ప-2 సరికొత్త చరిత్ర లిఖించింది! ఆ మల్టీప్లెక్స్ లో గైటీ, గెలాక్సీ, జెమిని, గ్యాసిప్, జెమ్, గ్లామర్ పేర్లతో ఆరు స్క్రీన్లు ఉండగా.. ఇప్పటివరకు హైయెస్ట్ గా రెండింటిలో మాత్రమే ఒకే కొత్త సినిమాను ప్రదర్శించారు సదరు మేకర్స్. కానీ ఇప్పుడు పుష్ప సీక్వెల్ ట్రెండ్ సెట్ చేస్తుంది.
మొత్తం ఆరు స్క్రీన్లలో కూడా పుష్ప-2 ప్రదర్శితమవ్వనుంది. దీంతో పెద్ద రికార్డనే చెప్పాలి! అయితే గెైటీలో 1000 మంది, గెలాక్సీలో 800 మంది ఒకేసారి వీక్షించవచ్చు. జెమినీలో 255 సీట్లు, గాసిప్ లో 105 సీట్లు, జెమ్ లో 47 సీట్లు, గ్లామర్ లో 46 సీట్లు ఉన్నాయి. ఒక్కో స్క్రీన్ లో 3 షోలు కాగా.. మొత్తం 18 షోలు పడనున్నాయి.
ఇక సినిమా విషయానికొస్తే.. సుకుమార్ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా యాక్షన్ డ్రామాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, అనసూయ, సునీల్, శ్రీతేజ్, దివి, ధనంజయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి పుష్ప 2 సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.