Begin typing your search above and press return to search.

హిందీలో ఆల్ టైమ్ హిట్స్ పుష్ప రాజ్ బ్రాండ్

అయితే వీటితో పాటు బాలీవుడ్ సినిమా గురించి మాట్లాడుకున్న ప్రతిసారి 'పుష్ప 2' గురించి కూడా కచ్చితంగా చర్చ జరుగుతుందనే మాట వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   21 Dec 2024 5:47 AM GMT
హిందీలో ఆల్ టైమ్ హిట్స్ పుష్ప రాజ్ బ్రాండ్
X

బాలీవుడ్ పరిశ్రమలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్స్ అంటే 'దేవదాస్', 'షోలే', 'దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే' సినిమాల పేరు చెబుతూ ఉంటారు. అలాగే మరికొన్ని ఎవర్ గ్రీన్ సినిమాలు కూడా ఉంటాయి. అయితే వీటితో పాటు బాలీవుడ్ సినిమా గురించి మాట్లాడుకున్న ప్రతిసారి 'పుష్ప 2' గురించి కూడా కచ్చితంగా చర్చ జరుగుతుందనే మాట వినిపిస్తోంది. ఈ చిత్రం బాలీవుడ్ హిస్టరీలో సరికొత్త అధ్యాయం లిఖించింది.

బాలీవుడ్ స్టార్స్ కి కూడా సాధ్యం కానీ అత్యధిక కలెక్షన్స్ రికార్డ్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రం ద్వారా అల్లు అర్జున్ క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. బన్నీ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ లకే స్టార్ గా మారిపోయింది. హిందీలో 'పుష్ప 2' కలెక్షన్స్ 650 కోట్లకి సమీపంలో ఉన్నాయి. వీక్ డేస్ తో పాటు క్రిస్మస్ సెలవులు కూడా కలిసిరాకున్న నేపథ్యంలో మరల వసూళ్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

అలాగే 'పుష్ప 2'లో మరో 20 నిమిషాల నిడివి సీన్స్ జత చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారని అనుకుంటున్నారు. ఇక ఈ మూవీకి మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, బీహార్ లాంటి రాష్ట్రాలలో బీ,సి సెంటర్స్ లలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అక్కడి ప్రేక్షకుల ఆదరణ కారణంగానే సినిమాకి ఈ స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి. టికెట్ ధరలు కూడా తగ్గిన నేపథ్యంలో ఈ క్రిస్మస్ సెలవులలో కూడా ప్రేక్షకులు 'పుష్ప 2' చూడటానికి ఆసక్తి చూపించొచ్చు అనుకుంటున్నారు.

తెలుగులో కూడా నరేష్ 'బచ్చలమల్లి', 'విడుదల 2', 'యూఐ' సినిమాలు ఓ మోస్తరు టాక్ మాత్రమే సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా 'పుష్ప 2' జోరు పెరుగుతుందని అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఇండస్ట్రీలో వరుసగా రికార్డులు బ్రేక్ చేసుకుంటూ వెళ్తోన్న ఈ మూవీ బాలీవుడ్ లో సరికొత్త శకానికి నాంది పలికిందని చెప్పొచ్చు. ఇకపై బాలీవుడ్ అంటే కేవలం హిందీ చిత్ర పరిశ్రమ మాత్రమే కాదని. ఇండియాలో ఏ భాషలో సినిమా తెరకెక్కిన బాలీవుడ్ జాబితాలోకి వస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

'పుష్ప 2' మూవీ లాంగ్వేజ్ బారియర్స్ ని పూర్తిగా చెరిపేసింది. ఎక్కడి నటీనటులు అయిన బలమైన కథలు నమ్ముకొని సినిమాలు చేస్తే దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరిస్తారని ప్రూవ్ చేసింది. కేవలం బాలీవుడ్ స్టార్స్ నటిస్తేనే నార్త్ ఇండియన్ ప్రేక్షకులు సినిమాలు చూస్తారని అభిప్రాయం కూడా మెల్లగా దూరం కాబోతోంది. సత్తా ఉండి, సిల్వర్ స్క్రీన్ పై తన టాలెంట్ తో ఆడియన్స్ ని మెప్పించేవాడే కింగ్ అవుతాడని 'పుష్ప 2' ద్వారా పబ్లిక్ బలంగా చెప్పారు.