Begin typing your search above and press return to search.

'పుష్ప‌-2' దూకుడుని కొత్త రిలీజ్ లు తట్టుకుంటాయా?

బాక్సాఫీస్ వ‌ద్ద `పుష్ప‌-2` ర‌ప్ఫాడించేస్తుంది. ఎక్క‌డా చూసినా పుష్ప మేనియా కొన‌సాగుతుంది.

By:  Tupaki Desk   |   8 Dec 2024 5:30 PM GMT
పుష్ప‌-2 దూకుడుని  కొత్త రిలీజ్ లు తట్టుకుంటాయా?
X

బాక్సాఫీస్ వ‌ద్ద `పుష్ప‌-2` ర‌ప్ఫాడించేస్తుంది. ఎక్క‌డా చూసినా పుష్ప మేనియా కొన‌సాగుతుంది. ఇప్ప‌ట్లో పుష్ప దూకుడిని అప‌డం అసాధ్య‌మైన ప‌ని. సినిమాపై ఎంత‌గా నెగిటివిటీ తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నించినా ఆ ప‌ప్పులెక్క‌డా ఉడ‌క‌లేదు. ఈ విష‌యంలో అల్లు ఆర్మీ గ్రాండ్ స‌క్సెస్ అయింది. వైల్డ్ ఫైర్ అంటూ అభిమానుల పోస్టుల‌తోనే స‌న్నివేశం అర్ద‌మ‌వుతుంది. టికెట్ ధ‌ర‌లు అధికంగా ఉన్నా ఏ ఒక్క‌రూ వెన‌క్కి త‌గ్గ‌డం లేదు.

టికెట్ ధ‌ర‌ల‌తో సంబంధం లేకుండా థియేట‌ర్లు హౌస్ పుల్ అవుతున్నాయి. అధిక ధ‌ర‌ల కార‌ణంగా రెండ‌వ రోజు నుంచి స్లో అవుతుంద‌నుకున్నా? ఆ స‌న్నివేశం ఎక్క‌డా క‌నిపించ‌లేద‌ని నిర్మాత‌ల మాట‌ల్ని బ‌ట్టి అర్ద‌మ‌వుతుంది. ఇక సాధార‌ణ టికెట్ ధ‌ర‌లు అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత దూకుడు ఇంకా రెట్టింపు అవుతుంద‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తుంది. మ‌రింత మంది థియేట‌ర్ వ‌ద్ద బారులు తీరుతార‌ని భావిస్తుంది.

`పుష్ప -2` విజ‌యంతో థియేట‌ర్ల వ‌ద్ద ఇలాంటి ప‌రిస్థితి ఉన్నా? క్రిస్మ‌స్ రిలీజ్ లు మాత్రం యధావిధిగా అవు తున్నాయి. ఏ ఒక్క‌రూ వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. అల్లరి నరేష్ న‌టించిన `బచ్చల మల్లి`, ప్రియదర్శి న‌టించిన `సారంగపాణి జాతకం`, ఉపేంద్ర హీరోగా న‌టించిన `యూఐ`, విజయ్ సేతుపతి న‌టించిన `విడుదల పార్ట్ 2` ప్ర‌క‌టించిన తేదీల ప్ర‌కారం రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు హాలీవుడ్ చిత్రం `ముఫాసా: ది లయన్ కింగ్` కూడా తదుపరి విడుదలకు సిద్ధంగా ఉంది.

అలాగే క్రిస్మ‌స్ వారంతంలో యూత్ స్టార్ నితిన్ న‌టించిన `రాబిన్ హుడ్` రిలీజ్ అవుతుంది. వెన్నెల కిషోర్ `శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్`, కిచ్చా సుదీప్ న‌టించిన `మ్యాక్స్ `, `బేబీ జాన్` కూడా రిలీజ్ అవుతున్న‌ట్లు తెలు స్తుంది. ఈ సినిమాల రిలీజ్ స‌మ‌యానికి `పుష్ప` థియేట‌ర్లు హౌస్ పుల్ అయితే గ‌నుక ఈ చిత్రాల్ని థియేట‌ర్ల‌లో కొన‌సాగించ‌డం క‌ష్ట‌మ‌నే టాక్ వినిపిస్తుంది. సినిమా కి మంచి టాక్ వ‌స్తే గ‌నుక పుష్ప‌-2 త‌ర్వాత ఆప్ష‌న్ గా ఈ చిత్రాన్ని పెట్టుకోవ‌చ్చు.