Begin typing your search above and press return to search.

పుష్ప2.. నైజాం కింగ్ అనేలా పవర్ఫుల్ డీల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ పైన దేశ వ్యాప్తంగా 1000 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లు టాక్ అయితే గట్టిగానే వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   25 Nov 2024 5:30 PM GMT
పుష్ప2.. నైజాం కింగ్ అనేలా పవర్ఫుల్ డీల్
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ పైన దేశ వ్యాప్తంగా 1000 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లు టాక్ అయితే గట్టిగానే వినిపిస్తోంది. ఇండియాలోనే అత్యధిక థీయాట్రికల్ బిజినెస్ జరిగిన చిత్రంగా ఈ మూవీ నిలిచిందని అంటున్నారు. ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ స్థాయిలో వ్యాపారం జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక మూవీ మొదటి రోజే 200 కోట్లకి పైగా కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా వసూళ్లు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమా చాలా రికార్డులని బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి నైజాంలో కూడా రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. నైజాంలో ఏకంగా మూడు ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాయి. టోటల్ గా 100 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ ఈ సినిమాపై జరిగిందని తెలుస్తోంది. ఒక్కరి మీద భారం పడకూడదని ముగ్గురు రంగంలోకి దిగుతుందడడం విషయం. మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఒక హ్యాండ్ వేసింది. నిర్మాతగా ఉన్నప్పటికీ డిస్ట్రిబ్యూటర్ గా 35 కోట్లు వారు పెట్టినట్లు టాక్. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ 25 కోట్లు, శశి 40 కోట్లు పెట్టి ‘పుష్ప 2’ రైట్స్ కొనుగోలు చేశారని సమాచారం.

ఇక నైజాం వ్యాప్తంగా ఈ సినిమాని ఏకంగా 550-600 థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఆల్ మోస్ట్ తెలంగాణలో 99% థియేటర్స్ లో ఈ మూవీ రిలీజ్ కాబోతోందని సమాచారం. మొదటి రోజే మెజారిటీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే లక్ష్యంతో బీ,సి సెంటర్స్ లలో కూడా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. నైజాంలో ఇంత భారీ స్థాయిలో రిలీజ్ అవుతోన్న ఫస్ట్ మూవీగా ‘పుష్ప 2’ నిలవబోతోంది.

పుష్ప సినిమాకి నైజాంలో మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ కూడా రికార్డ్ స్థాయిలో వసూళ్లు అందుకోవడం గ్యారెంటీ అని మేకర్స్ అనుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాలకి ఆంధ్రాలో కంటే నైజాంలోనే ఎక్కువ వసూళ్లు వస్తున్నాయి. ‘పుష్ప 2’ కూడా అలాగే వస్తాయని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. రెండు రాష్ట్రాలలో టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వబోతున్నాయి.

అలాగే స్పెషల్ ప్రీమియర్ షోలు వేసుకోవడానికి కూడా అనుమతులు తెచ్చుకునే పనిలో మేకర్స్ ఉన్నారు. ఈ స్పెషల్ షోలకి ఇంకా అధికంగా టికెట్ ధరలు పెట్టుకునే వెసులుబాటు కూడా ఉండబోతోంది. కచ్చితంగా ఇవన్నీ కూడా మూవీకి కలెక్షన్స్ పరంగా కలిసి వస్తాయని భావిస్తున్నారు. అల్లు అర్జున్ బ్రాండ్, పుష్ప 2 మానియా ప్రేక్షకులని ఏ మేరకు థియేటర్స్ కి రప్పిస్తుందనేది వేచి చూడాలి.