Begin typing your search above and press return to search.

బెంగాల్‌లో పుష్ప-2 సంచలనం

పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం అక్కడ అదిరిపోయే వసూళ్లతో దూసుకెళ్లింది.

By:  Tupaki Desk   |   4 Jan 2025 2:25 PM GMT
బెంగాల్‌లో పుష్ప-2 సంచలనం
X

పుష్ప అనే పాత్రకు నార్త్ ఇండియన్స్ ఎంతగా కనెక్ట్ అయ్యారో 'పుష్ప: ది రైజ్' రిలీజైన కొన్ని రోజులకే అర్థమైంది. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం అక్కడ అదిరిపోయే వసూళ్లతో దూసుకెళ్లింది. త్వరగా ఓటీటీలోకి వచ్చేయడం వల్ల థియేట్రికల్ రన్ త్వరగా ముగిసింది కానీ.. లేదంటే హిందీ వెర్షన్ చాన్నాళ్లే ఆడేది. ఇంకా ఎక్కువ వసూళ్లు సాధించేది. సినిమా రిలీజ్ తర్వాత రీల్స్, షార్ట్స్ ద్వారా పుష్ప పాత్ర అక్కడి జనాలకు మరింతగా ఎక్కేసింది. దీంతో పుష్ప-2కు నార్త్ ఇండియాలో మామూలు హైప్ రాలేదు. ఇండియా బోర్డర్లో ఉండే నేపాల్ దేశంలో సైతం పుష్ప-2 ఫీవర్ పీక్స్‌కు వెళ్లిపోయింది. ఉత్తరాదిన ఈ సినిమాకు సరైన ప్రమోషన్ లేదు. ఏ హడావుడి లేదు. విడుదలై నెల రోజులు కావస్తున్నా ఇంకా అక్కడ జోరు తగ్గట్లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక సౌత్ ఇండియా అంతటా 'పుష్ప-2' రన్ ముగింపు దశకు చేరుకోగా.. ఉత్తరాదిన మాత్రం ఇంకా మంచి వసూళ్లు వస్తున్నాయి.

ఇప్పటికే ఇండియాలో హైయెస్ట్ గ్రాసింగ్ హిందీ ఫిలింగా డబ్బింగ్ మూవీ అయిన 'పుష్ప-2' రికార్డులు బద్దలు కొట్టేసింది. ఇక నార్త్‌లో వేర్వేరుగా ఒక్కో రాష్ట్రంలోనూ ఆల్ టైం రికార్డులు బద్దలవుతున్నాయి. తాజాగా బెంగాల్‌లో సంచలన రికార్డును సొంతం చేసుకుంది పుష్ప-2. ఆ రాష్ట్రంలో పుష్ప-2 రూ.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇది మనకు పెద్ద నంబర్ కాకపోవచ్చు. కానీ బిజినెస్ పరంగా తక్కువ పరిధి ఉన్న బెంగాల్‌ సినిమాలో ఇది ఓ సంచలనం. ఇప్పటిదాకా ఏ బెంగాలీ స్ట్రెయిట్ మూవీ కూడా 50 కోట్ల వసూళ్లు సాధించలేదు. 2017లో వచ్చిన అమేజాన్ ఓర్బిజాన్ అనే సినిమా రూ.48 కోట్ల వసూళ్లతో ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. ఇప్పుడా సినిమా వసూళ్లను 'పుష్ప-2' దాటేసింది. ఒక డబ్బింగ్ సినిమా ఇలా ఆల్ టైం రికార్డు నెలకొల్పడం అంటే చిన్న విషయం కాదు. ఇలా నార్త్ ఇండియాలో పుష్ప-2 సంచలనాలు మామూలుగా లేవు.