Begin typing your search above and press return to search.

నార్త్ అమెరికాలో పుష్ప 2 బీభత్సం.. ఇది మరో రికార్డ్

ఈ రెండు రోజులు వీకెండ్ మూవీ భారీ వసూళ్లని అందుకోవడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   8 Dec 2024 4:29 AM GMT
నార్త్ అమెరికాలో పుష్ప 2 బీభత్సం.. ఇది మరో రికార్డ్
X

'పుష్ప 2' మూవీ సినిమా వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే 500 కోట్ల క్లబ్ లో ఈ మూవీ చేరిపోయిందని తెలుస్తోంది. నెక్స్ట్ 1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ ని ఎన్ని రోజులలో ఈ చిత్రం అందుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కచ్చితంగా 100 కోట్ల కలెక్షన్స్ క్లబ్ లో 'పుష్ప 2' చేరడం అయితే ఖాయంగా కనిపిస్తోంది. ఈ రెండు రోజులు వీకెండ్ మూవీ భారీ వసూళ్లని అందుకోవడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే ఈ మూవీ నార్త్ అమెరికాలో కూడా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అక్కడ తెలుగు వెర్షన్ కి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. దాంతో పాటు హిందీ వెర్షన్ కూడా 1 మిలియన్ కలెక్షన్స్ ని క్రాస్ చేయబోతోందని తెలుస్తోంది. శనివారం నాటికి నార్త్ అమెరికాలో 'పుష్ప 2' హిందీ వెర్షన్ కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది.

ఇప్పటికే హిందీ బెల్ట్ లో మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా పుష్ప 2 నిలిచింది. మూడో రోజు కూడా హిందీలో ఈ చిత్రం 75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇది నిజంగా రేర్ ఫీట్ అని చెప్పొచ్చు. దీనిని బట్టి సినిమాపై నార్త్ ఇండియన్ ఆడియన్స్ ఏ స్థాయి క్రేజ్ తో ఉన్నారో అర్ధమవుతోంది. ఈ ఏడాది హిందీలో హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా స్త్రీ2 మూవీ నిలిచింది.

ఈ మూవీ కలెక్షన్స్ ని 'పుష్ప 2' బ్రేక్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. అల్లు అర్జున్ మాసివ్ పెర్ఫార్మెన్స్, సుకుమార్ టేకింగ్ కి అక్కడి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. కంప్లీట్ గా మాస్ పల్స్ పట్టుకొని నార్త్ ఇండియన్ ఆడియన్స్ కి 'పుష్ప 2'తో అల్లు అర్జున్ అండ్ సుకుమార్ పూనకాలు తెప్పించారని సినీ విశ్లేషకులు అంటున్నారు. అల్లు అర్జున్ వన్ మెన్ షోకి యునానమస్ లో అన్ని చోట్ల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ చిత్రంతో బన్నీ మరోసారి నేషనల్ అవార్డు అందుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.