Begin typing your search above and press return to search.

హిందీలో టాప్ 10… పుష్ప 2 నెంబర్ ఎంతంటే?

‘పుష్ప 2’ సినిమా ప్రభంజనం నార్త్ ఇండియాలో బలంగా ఉంది. హిందీలో స్టార్ హీరోల నుంచి వచ్చిన సినిమాల కంటే అత్యధిక కలెక్షన్స్ ఈ సినిమాకి వస్తూ ఉన్నాయి.

By:  Tupaki Desk   |   16 Dec 2024 11:41 AM GMT
హిందీలో టాప్ 10… పుష్ప 2 నెంబర్ ఎంతంటే?
X

ఇండియన్ సినిమా అంటే ఒకప్పుడు బాలీవుడ్ అనే పేరు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తూ ఉండేది. సౌత్ సినిమాలని అప్పట్లో ఎవరు పరిగణంలోకి తీసుకునే వారు కాదు. అయితే బాహుబలి సిరీస్ తర్వాత ట్రెండ్ మారింది. ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ అనే పేరు గట్టిగా వినిపిస్తోంది. తెలుగు సినిమాకి రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు తెలుగు సినిమా బాలీవుడ్ ని సైతం శాసించే స్థాయికి వెళ్ళిపోయింది.

‘పుష్ప 2’ సినిమా ప్రభంజనం నార్త్ ఇండియాలో బలంగా ఉంది. హిందీలో స్టార్ హీరోల నుంచి వచ్చిన సినిమాల కంటే అత్యధిక కలెక్షన్స్ ఈ సినిమాకి వస్తూ ఉన్నాయి. దీనిని బట్టి మన సినిమాకి నార్త్ లో ఏ విధంగా డిమాండ్ పెరిగిందో అంచనా వేయవచ్చు. ‘పుష్ప 2’ మూవీ కేవలం 11 రోజుల్లోనే 561.5 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో టాప్ 3లో ఈ సినిమా నిలిచింది.

అలాగే హిందీలో రెండో వారం అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా కూడా ఈ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. 11వ రోజు 100 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించిన ఫస్ట్ ఇండియన్ మూవీగా కూడా ఈ సినిమా మరో ఫీట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే హిందీలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల జాబితా చూసుకుంటే టాప్ 1లో ‘స్త్రీ2’ మూవీ ఉంది. ఈ సినిమా 667.02 కోట్ల కలెక్షన్స్ లాంగ్ రన్ లో వసూళ్లు చేసింది.

దీని తర్వాత షారుఖ్ ఖాన్ ‘జవాన్’ మూవీ నిలిచింది. ఈ సినిమాకి 585.3 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ‘పుష్ప 2’ మూడో స్థానంలో ఉండగా బాబీ డియోల్ ‘గద్దర్ 2’ మూవీ 525.45 కోట్ల కలెక్షన్స్ తో టాప్ 4గా నిలిచింది. 524.53 కోట్ల కలెక్షన్స్ తో టాప్ 5 హైయెస్ట్ గ్రాస్ మూవీగా షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ ఉంది. వీటి తర్వాత ‘బాహుబలి 2’, ‘యానిమల్’, ‘కేజీఎఫ్ 2’, ‘దంగల్’, ‘సంజు’ సినిమాలు వరుస స్థానాలలో ఉన్నాయి. ‘పుష్ప 2’ మూవీ లాంగ్ రన్ లో ‘స్త్రీ 2’ కలెక్షన్స్ ని కూడా బ్రేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 700+ కోట్ల వరకు కలెక్షన్స్ నమోదు చేయొచ్చని భావిస్తున్నారు.

స్త్రీ 2 - 627.02Cr

జవాన్ - 585.3Cr

పుష్ప 2 - 561.5Cr (11D)

గద్దర్ 2 - 525.45Cr

పఠాన్ - 524.53Cr

బాహుబలి 2 - 511Cr

యానిమల్ - 505Cr

కేజీఎఫ్ చాప్టర్ 2 - 434.7Cr

దంగల్ - 374.4Cr

సంజు - 342.53Cr