పుష్ప-2.. బన్నీ కళ్లన్నీ 'ఆ' వైపే?
డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఆ మూవీ.. అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కొల్లగొడుతోంది.
By: Tupaki Desk | 11 Dec 2024 4:19 PM GMTటాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప-2 చిత్రం ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఆ మూవీ.. అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కొల్లగొడుతోంది.
తాజాగా సరికొత్త అధ్యాయం లిఖించింది. కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల గ్రాస్ మార్క్ ను టచ్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అత్యంత వేగంగా రూ.1000 కోట్లు సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచి సత్తా చాటింది. మొత్తంగా ఇప్పటి వరకు రూ.1002 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడీ తర్వాత భారీ వసూళ్లు అందుకున్న తెలుగు చిత్రంగా ఘనత సాధించింది.
అయితే పుష్ప-2.. నార్త్ లో కూడా అదరగొడుతున్న విషయం తెలిసిందే. కేవలం 6 రోజుల్లోనే హిందీలో అత్యంత వేగంగా రూ.375 కోట్ల నెట్ మార్క్ ను అందుకున్న చిత్రంగా నిలిచింది పుష్ప-2. నార్త్ అమెరికాలో నెవ్వర్ బిఫోర్ ఇండియన్ మూవీ అనేలా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు 10 మిలియన్ల డాలర్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
అది కూడా ఆ రెండు ఘనతలను పుష్ప సీక్వెల్ ఫస్ట్ వీకెండ్ లో సాధించడం గమనార్హం. ఇప్పుడు ఎన్నో రికార్డులను బద్దలు కొడుతున్న పుష్ప-2ను ఆస్కార్ రేసులోకి తీసుకెళ్లాలని అల్లు అర్జున్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. బెస్ట్ హీరోతో పాటు బెస్ట్ మూవీకి గాను నామినేషన్లు అందుకోవాలనే లక్ష్యంతో ఉన్నారట.
అదే సమయంలో ఆస్కార్ సాధించాలనే టార్గెట్ తో ఆర్ఆర్ఆర్ టీమ్ చేసిన విధంగానే అమెరికాలో ప్రమోషన్లకు భారీగా పెట్టుబడులు పెట్టాలని అల్లు అర్జున్ యోచిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నేషనల్ అవార్డు సొంతం చేసుకుని ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన.. ఇప్పుడు ఇదే బెస్ట్ ఛాన్స్ గా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే రాజమౌళి అండ్ టీమ్.. ఆర్ ఆర్ ఆర్ ను హాలీవుడ్ లో భారీగా ప్రమోట్ చేసింది. అనేక ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించింది. అందరి దృష్టిని ఆకర్షించింది. చివరకు ఆస్కార్ అవార్డు పట్టుకుంది. ఇప్పుడు అదే రీతిలో పుష్ప టీమ్ ప్రమోట్ చేయడం అంత ఈజీ కాదు.. అలా అని ఆస్కార్ కోసం ప్రచారం చేసే అవకాశాన్ని కోల్పోవడం పొరపాటు. కాబట్టి పుష్ప టీమ్ ఏం చేస్తుందో వేచి చూడాలి.