ఈ ప్లాన్ తో 2 వేల కోట్లు సాధ్యమేనా?
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలైన వెంటనే భారీ వసూళ్లను సాధించి భారతీయ సినిమా ఇండస్ట్రీలో మరో బెంచ్‌మార్క్‌ను సృష్టించింది.
By: Tupaki Desk | 16 Jan 2025 11:37 AM GMTఅల్లు అర్జున్ స్టామినా ఏమిటో మరోసారి పాన్ ఇండియా మార్కెట్‌లో రుజువైంది. మాస్ కంటెంట్ ఉన్న సినిమాలతో ఎన్ని రికార్డులు సాధించవచ్చో ''పుష్ప 2 ది రూల్'' మరలా నిరూపించింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలైన వెంటనే భారీ వసూళ్లను సాధించి భారతీయ సినిమా ఇండస్ట్రీలో మరో బెంచ్‌మార్క్‌ను సృష్టించింది.
ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా తన స్థాయిని మరింత పెంచుకున్నారు. హిందీ మార్కెట్‌లోనూ భారీ హిట్ అందుకున్న ఈ సినిమా, సౌత్ ఇండియన్ సినిమాల స్థాయిని మరో లెవెల్‌కి తీసుకెళ్లింది. రష్మిక మందన్నా, ఫహద్ ఫాసిల్ వంటి నటీనటులు ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. సినిమా విడుదలై ఇప్పటికే 40 రోజులు దాటింది. అయినా కూడా పుష్ప రాజ్ జోరు తగ్గడం లేదు.
ఇప్పుడు, ''పుష్ప 2'' అదనపు నిడివితో తిరిగి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవ్వడం మరో విశేషం. జనవరి 17 నుంచి 20 నిమిషాల అదనపు నిడివితో ఈ చిత్రం విడుదల కాబోతోంది. మేకర్స్ ఈ విషయాన్ని కొన్ని రోజులు క్రితమే ప్రకటించారు. అదనపు కంటెంట్‌తో ఈ సినిమాను మరింత గ్రాండ్‌గా చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈసారి “పుష్ప 2” తక్కువ టికెట్ ధరలతో రిలీజ్ కాబోతోంది. సింగిల్ స్క్రీన్స్‌లో గరిష్టంగా రూ.112, మల్టీప్లెక్సుల్లో రూ.150 టికెట్ ధరను నిర్ణయించారు. ఇది సినిమా చూసేందుకు ప్రేక్షకులకు మరింత అందుబాటులో ఉంటుంది. తక్కువ ధరతో, అధిక నిడివితో వస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ బుకింగ్స్ కనిపిస్తున్నాయి.
మేకర్స్ విడుదల చేస్తున్న అదనపు 20 నిమిషాల నిడివి సినిమాలో మరింత రసప్రధంగా మారబోతోందని చెప్పవచ్చు. ఈ కంటెంట్ కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఉన్నారు. మునుపటి రికార్డులను బ్రేక్ చేసిన ఈ సినిమా, ఇప్పుడు మరింత వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే 1800 కోట్లను దాటిన కలెక్షన్లు ఈ ప్లాన్ తో 2 వేల కోట్ల మార్క్ ను టచ్ చేస్తుందో లేదో చూడాలి.
41 రోజుల్లో వచ్చిన వసూళ్ల వివరాలు:
AP-TG Total: రూ. 225.75 కోట్లు (గ్రాస్: రూ. 343.90 కోట్లు)
కర్ణాటక: రూ. 53.27 కోట్లు
తమిళనాడు: రూ. 34.78 కోట్లు
కేరళ: రూ. 7.60 కోట్లు
హిందీ+ROI: రూ. 385.25 కోట్లు
ఓవర్సీస్: రూ. 127.15 కోట్లు
మొత్తం WW వసూళ్లు: రూ. 833.80 కోట్లు (గ్రాస్: రూ. 1,800.10 కోట్లు+
మొత్తం బిజినెస్: రూ. 617 కోట్లు
బ్రేక్ ఈవెన్: రూ. 620 కోట్లు
ప్రాఫిట్: రూ. 213.80 కోట్లు (బ్లాక్ బస్టర్)