Begin typing your search above and press return to search.

కేరళ టాప్ మూవీస్.. పుష్ప 2 లెక్క ఎంత?

అక్కడ బన్నీ కి ఫ్యాన్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ మూవీ కేరళ రైట్స్ ని 20 కోట్లకి మేకర్స్ అమ్మారు.

By:  Tupaki Desk   |   27 Dec 2024 10:05 AM GMT
కేరళ టాప్ మూవీస్.. పుష్ప 2 లెక్క ఎంత?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి తెలుగు తర్వాత కేరళలో ఎక్కువ క్రేజ్ ఉంది. అతని సినిమాలన్నీ కూడా మలయాళంలో డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయ్యేవి. కొన్ని సినిమాలు మంచి సక్సెస్ కూడా అందుకున్నాయి. అందుకే మలయాళీ ఆడియన్స్ అంటే అల్లు అర్జున్ కి ప్రత్యేక అభిమానం. ‘పుష్ప 2’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కొచ్చిలో అల్లు అర్జున్ తనని తాను కేరళ దత్తపుత్రుడు అని ప్రకటించుకున్నాడు.

అక్కడ బన్నీ కి ఫ్యాన్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ మూవీ కేరళ రైట్స్ ని 20 కోట్లకి మేకర్స్ అమ్మారు. ఈ కలెక్షన్స్ ఈజీగా అందుకుంటుందని అనుకున్నారు. అయితే అనూహ్యంగా ‘పుష్ప 2’ మూవీ కేరళలో అంత ప్రభావం చూపించలేదని చెప్పాలి. ఇప్పటి వరకు కేరళలో ఈ మూవీ 17.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూళ్లు చేసింది.

ఈ మూవీ కలెక్షన్స్ కేరళలో ఆల్ మోస్ట్ క్లోజ్ అయిపోయాయి. ప్రస్తుతం అక్కడ మార్కో మూవీ హవా నడుస్తోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుకుంటే అక్కడ ‘పుష్ప 2’ బ్రేక్ ఈవెన్ అందుకునే అవకాశం లేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది కేరళలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న తెలుగు సినిమాల జాబితా చూసుకుంటే ‘కల్కి 2898ఏడీ’ మొదటి స్థానంలో ఉంది.

ఈ సినిమా లాంగ్ రన్ లో 31 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఇక రెండో స్థానంలో దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ మూవీ నిలిచింది. ఈ సినిమా 21.55 కోట్లను కలెక్ట్ చేసింది. దుల్కర్ సల్మాన్ ఇమేజ్ లక్కీ భాస్కర్ సినిమాకి కేరళలో ప్లస్ అయ్యింది. దీని తర్వాత మూడో స్థానంలో ‘పుష్ప 2’ చిత్రం ఉంది. ఈ మూవీ 17.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని ఇప్పటి వరకు అందుకుంది.

నాలుగో స్థానంలో ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం ఉంది. ఈ సినిమా 2.15 కోట్ల గ్రాస్ మాత్రమే కేరళలో కలెక్ట్ చేసింది. ఇక ఏ తెలుగు సినిమా కూడా కేరళలో పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇదిలా ఉంటే మలయాళంలో మోహన్ లాల్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బరోజ్’ మూవీ పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ లభించలేదు. హాలీవుడ్ లెవల్ లో విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని మోహన్ లాల్ సిల్వర్ స్క్రీన్ పైన ఆవిష్కరించిన ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదని తెలుస్తోంది.

కేరళ బాక్స్ ఆఫీస్ వద్ద 2024 టాప్ 4 టాలీవుడ్ సినిమాలు

కల్కి 2898AD : ₹31.00 Cr

లక్కీబాస్కర్ : ₹21.55 కోట్లు

3పుష్ప2 ~ ₹17.75 కోట్లు

దేవర : ₹2.15 కోట్లు