వీడియో : కిస్సిక్ మేకింగ్ చూశారా..!
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప 2' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
By: Tupaki Desk | 27 March 2025 9:41 AMఅల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప 2' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా విజయంలో అన్ని విషయాలతో పాటు సంగీతం కూడా అత్యంత కీలకంగా వర్క్ చేసింది అనడంలో సందేహం లేదు. సినిమాలోని అన్ని పాటలకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా కిస్సిక్ సాంగ్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా స్థాయిని పెంచడంలో కిస్సిక్ సాంగ్ కీలక పాత్ర పోషించింది, సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కిస్సిక్ పాటలో అల్లు అర్జున్‌తో శ్రీలీల వేసిన స్టెప్స్‌కి మంచి స్పందన వచ్చింది. బాలీవుడ్ హీరోయిన్‌తో చేయాలనుకున్న కిస్సిక్ పాటను శ్రీలీలతో చేసిన విషయం తెల్సిందే.
గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించిన కిస్సిక్ సాంగ్ మేకింగ్ వీడియో తాజాగా విడుదలైంది. సాధారణంగా మేకింగ్ వీడియో అంటే నిమిషం లేదా రెండు నిమిషాలు ఉంటుంది. కానీ ఈ మేకింగ్ వీడియో విభిన్నంగా మొత్తం పాట ఉన్నంత సేపు ఉంది. నాలుగు నిమిషాలకు పైగా ఉన్న ఈ మేకింగ్ వీడియో రియల్ టైం పాట ఎలా ఉంటుందో దాన్ని చూపిస్తూ అక్కడక్కడ మేకింగ్ విజువల్స్‌ను వదిలారు. దాంతో పాట చూస్తున్న ఫీల్ కలగడంతో మేకింగ్ విజువల్స్‌ను చూసే అవకాశం కూడా ప్రేక్షకులకు ఈ వీడియోతో దక్కింది. అందుకే తక్కువ సమయంలోనే ఈ వీడియోకు లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. సినిమా వచ్చి నాలుగు నెలలు అవుతున్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు.
కిస్సిక్ సాంగ్‌తో శ్రీలీలకు పాన్ ఇండియా రేంజ్‌లో మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా శ్రీలీల డాన్స్ గురించి అంతా మాట్లాడుకునే విధంగా ఉందంటూ అంతా కామెంట్ చేశారు. అల్లు అర్జున్‌కు శ్రీలీల సరి జోడీ కాదు అంటూ కొందరు కామెంట్ చేసినా ఓవరాల్‌గా సినిమాలోని కిస్సిక్ సాంగ్‌కి హిట్ టాక్ దక్కింది. సినిమా విజయంలో కిస్సిక్ కీలక పాత్ర పోషించింది అనడంలో సందేహం లేదని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పుష్ప 2 సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటించిన విషయం తెల్సిందే. ఈ మేకింగ్ వీడియోలో రష్మిక మందన్నను చూడవచ్చు.
పుష్ప 1 లో అల్లు అర్జున్‌తో ప్రత్యేక పాట ఊ అంటావా లో సమంత నటించిన విషయం తెల్సిందే. మొదటి పార్ట్‌లో ఐటెం సాంగ్ సూపర్ హిట్ దక్కించుకున్న నేపథ్యంలో సెకండ్ పార్ట్‌లో ఆ స్థాయిలో ఐటెం సాంగ్ ఉంటుందా అనే అనుమానంను కొందరు వ్యక్తం చేశారు. కిస్సిక్ సాంగ్ ఏకంగా సమంతను కూడా మెప్పించే విధంగా రూపొందింది. సమంత సైతం కిస్సిక్‌కి మంచి రివ్యూను ఇచ్చిన విషయం తెల్సిందే. పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.1850 కోట్ల వసూళ్లు రాబట్టడం ద్వారా పాన్ ఇండియా రేంజ్‌లో అరుదైన రికార్డ్‌లను నమోదు చేసింది. హిందీలో ఈ సినిమా దాదాపు వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టి నెం.1 స్థానంలో నిలిచింది.