Begin typing your search above and press return to search.

కిస్సిక్… ఇంతకి క్లిక్కయ్యిందా లేదా?

మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘పుష్ప 2’ నుంచి తాజాగా ఐటెం సాంగ్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

By:  Tupaki Desk   |   25 Nov 2024 5:32 AM GMT
కిస్సిక్… ఇంతకి క్లిక్కయ్యిందా లేదా?
X

మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘పుష్ప 2’ నుంచి తాజాగా ఐటెం సాంగ్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కిస్సిక్ అంటూ సాగే ఈ సాంగ్ ని చెన్నైలో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. అయితే ‘పుష్ప’ సినిమాలోని ప్రతి సాంగ్ ఒక ట్రెండ్ సెట్టర్. అందుకే ‘పుష్ప 2’ నుంచి వచ్చిన సాంగ్స్ ని ఆడియన్స్ కచ్చితంగా పుష్పలోని పాటలతో కంపారిజన్ చేస్తారు. నిజానికి ఏ పాటకి ఉండాల్సిన స్థాయి ఆ సాంగ్ కి కచ్చితంగా ఉంటుంది. కానీ పోలిక పెట్టి చూసినపుడు ఆడియన్స్ డిజపాయిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

‘పుష్ప 2’ నుంచి శ్రీవల్లి సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ‘పుష్ప’ సినిమాలోని శ్రీవల్లి సాంగ్ కి పోటీ ఇచ్చేలా ఉందనే అభిప్రాయం పబ్లిక్ నుంచి వచ్చింది. అలాగే పుష్పరాజ్ టైటిల్ సాంగ్ కి కూడా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ‘పుష్ప’లోని సమంత డాన్స్ చేసిన ఐటెం సాంగ్ ఊ అంటావా ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఆ సాంగ్ సినిమాకి ఎక్కువ హైప్ తీసుకొచ్చింది. ముఖ్యంగా సాంగ్ లో చంద్రబోస్ సాహిత్యం కూడా అద్భుతంగా ఉందనే ప్రశంసలు లభించాయి.

ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ సినిమాలో శ్రీలీలపై చిత్రీకరించిన ఐటెం సాంగ్ ఊ అంటావా పాటని రీప్లేస్ చేస్తుందా లేదా అనే ఆసక్తి అందరిలో క్రియేట్ అయ్యింది. తాజాగా రిలీజ్ అయిన ఈ పాటకి అనుకున్న స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ఊ అంటావా సినిమాతో పోల్చి చూస్తే ఒక మోస్తరుగానే ఉందనే అభిప్రాయం పబ్లిక్ నుంచి వస్తోంది, చంద్రబోస్ సాహిత్యం కూడా అంచనాలని అందుకోలేకపోయిందని కామెంట్స్ వస్తున్నాయి.

ఈ సందర్భంగా ప్రేక్షకులు కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఊ అంటావా వైల్డ్ ఫైర్ అయితే కిస్సిక్ కేవలం ఫైర్ మాత్రమే అని ఒకరు కామెంట్స్ చేశారు. ఊ అంటావా సాహిత్యం, మ్యూజిక్, వోకల్ తో పోల్చుకుంటే కిస్సిక్ అంచనాలు అందుకోలేకపోయింది. హిందీ లిరికల్ వీడియోలో ఓ చోట తెలుగు సాహిత్యం వినిపించింది. ఇందులో మా ఫోటోలు లీక్ చేస్తే దెబ్బలు పడతాయ్ అనే లైన్ కాస్త హైలెట్ అయ్యింది.

ఊ అంటావాలో ఉన్నంత మ్యూజిక్ ఎఫెక్ట్ కిస్సిక్ లో లేవు. దీనిలో డాన్స్ స్టెప్స్ ఎక్కువగా ఎక్స్ పెక్ట్ చేయలేము. ఊ అంటావా స్థాయిలో మరోసారి బలమైన సాహిత్యాన్ని వినిపించడానికి సుకుమార్, చంద్రబోస్ సమయం తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఈ పాటలో ఫైర్ లేదు ఎందుకంటే ఈవెంట్ లో డిఎస్పీ ఫైర్ మీద ఉన్నాడు అంటూ నెటిజన్లు డిఫరెంట్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సాంగ్ పై వచ్చిన రెస్పాన్స్ లో ఎక్కువగా మిశ్రమ స్పందనలు ఉండటం గమనార్హం. ఊ అంటావాతో పోల్చుకుంటే దాని దరిదాపుల్లో కూడా కిస్సిక్ నిలబడదని అంటున్నారు. మరి సినిమాలో ఫుల్ సాంగ్ చూసినప్పుడు ఎలా ఉంటుందో చూడాలి.