Begin typing your search above and press return to search.

ఫ్లాష్ బ్యాక్ ట్రెండ్.. పుష్ప-2తో ఇప్పుడు మళ్లీ కొత్తగా..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 Feb 2025 6:30 PM GMT
ఫ్లాష్ బ్యాక్ ట్రెండ్.. పుష్ప-2తో ఇప్పుడు మళ్లీ కొత్తగా..
X

సినీ ఇండస్ట్రీలో పలు విషయాల్లో ట్రెండ్స్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ఒకప్పటి ట్రెండ్స్.. ఇప్పుడు మళ్లీ కొత్తగా సందడి చేస్తుంటాయి. అలా ఇప్పటికే వివిధ సందర్భాల్లో.. అనేక విషయాల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పుష్ప 2: ది రూల్ మూవీతో కనుమరుగైన ఓ ట్రెండ్.. మళ్లీ సందడి చేస్తోంది!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఆ సినిమా.. ఓ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేసింది. అనేక రికార్డులు బద్దలు కొట్టింది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసి దూసుకుపోతుందని చెప్పాలి.

అయితే పుష్ప-2 మేకర్స్.. అనౌన్స్మెంట్ నుంచి కూడా వేరే లెవెల్ లో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. రిలీజ్ అయ్యాక కూడా అదే పంథా కొనసాగించారు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసినా వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తున్నట్లే కనిపిస్తున్నారు. రిలీజ్ అయ్యి రెండు నెలలు కంప్లీట్ అవుతున్నా.. ఇంకా సౌండ్ వినిపిస్తూనే ఉన్నారు.

తాజాగా సినిమాలో ముఖ్యమైన సీన్స్ కు సంబంధించిన డైలాగ్స్ ను జ్యూక్ బాక్స్ గా రిలీజ్ చేసింది. కేవలం డైలాగ్స్ వినగలిగే అవకాశం కల్పించింది. సాంగ్స్ కు అలవాటు పడిన ప్రస్తుత రోజుల్లో పుష్ప-2 మేకర్స్.. మళ్లీ పాత ట్రెండ్ ను రీస్టార్ట్ చేశారు. అయితే ఒకప్పుడు డైలాగ్స్ క్యాసెట్లు అందుబాటులో ఉండేవన్న విషయం తెలిసిందే.

చిత్రాలను రిపీట్ మోడ్ లో చూసే ఛాన్స్ అప్పుడు లేకపోవడంతో అంతా డైలాగ్స్ క్యాసెట్స్ కొని వినేవాళ్లు. 2004 వరకు ఆ క్యాసెట్లు అక్కడకక్కడ దొరికేవి. అలా కొంతకాలానికి మాయమైపోయాయి. డిజిటల్ మీడియా బాగా మనుగడలో వచ్చాక డైలాగ్స్ క్యాసెట్లను అంతా కొనడం మానేశారు. దీంతో అవి మార్కెట్లోకి రావడం ఆగింది.

ఇప్పుడు పుష్ప-2 సినిమాలో కొన్ని క్రేజీ సంభాషణలకు సంబంధించిన డైలాగ్స్ ను మేకర్స్.. సోషల్ మీడియాలో జ్యూక్ బాక్స్ రూపంలో రిలీజ్ చేశారు. రావు రమేష్ ను పుష్పరాజ్ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పడం, శ్రీవల్లి తన భర్త గురించి వివరించడం, ఎర్ర చందనం డీల్ సహా పలు సీన్ల డైలాగ్స్ మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ జ్యూక్ బాక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్ప మేకర్స్ ప్లాన్ సక్సెస్ అయితే.. మిగతా చిత్రాల డైలాగ్స్ జ్యూక్ బాక్స్ లు కూడా వచ్చే అవకాశం ఉంది.