Begin typing your search above and press return to search.

'పుష్ప 2' జాతర ఎలా ఉంటుందో?

టాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన పాన్ ఇండియా సినిమాలు ఒక్కటొక్కటిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   18 Oct 2024 11:30 AM GMT
పుష్ప 2 జాతర ఎలా ఉంటుందో?
X

టాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన పాన్ ఇండియా సినిమాలు ఒక్కటొక్కటిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి' సినిమాతో వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. లేటెస్టుగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 'దేవర 1' చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాపైనే అందరి దృష్టి పడింది. ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఎంత కలెక్ట్ చేస్తుంది? అనే చర్చలు ట్రేడ్ లో జరుగుతున్నాయి.

నిజానికి ఇటీవల కాలంలో ఏ పెద్ద సినిమాకి కూడా యునానమస్ గా పాజిటివ్ టాక్ రాలేదు. 'కల్కి 2898 AD' సినిమాకు యూఎస్ ప్రీమియర్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ ఆ టాక్ ని తట్టుకొని బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా నిలబడింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్లకి పైగా కలెక్షన్లు రాబట్టింది. సినిమాలో ఉన్న ఫ్రెష్ కంటెంట్ కు, ప్రభాస్ స్టార్ పవర్ కూడా యాడ్ అవడంతో ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

'దేవర' సినిమా విషయానికొస్తే, కంటెంట్ పరంగా చూసుకుంటే ఇది యావరేజ్ కంటెంట్. దీనికి తగ్గట్టుగానే మిక్స్డ్ టాక్ వచ్చింది.. రివ్యూలు కూడా అలానే వచ్చాయి. కానీ RRR తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన సినిమా కావడం, దీనికి ఆయన స్టార్ డమ్ కూడా తోడవడంతో బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకుంది. హాలిడేస్ ను క్యాష్ చేసుకుని రూ. 500 కోట్ల మార్క్ ను క్రాస్ చేయగలిగింది. ఇది బ్లాక్ బస్టర్ మూవీ అయితే కాదు, కానీ హిట్ అనిపించుకుంది.

కల్కి, దేవర సినిమాల తర్వాత రాబోతున్న 'పుష్ప 2' పరిస్థితి ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఇయర్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ "పుష్ప 2: ది రూల్". 'పుష్ప: ది రైజ్' సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అల్లు అర్జున్ ఈసారి పుష్పరాజ్ గా ఎలాంటి పెర్ఫార్మెన్స్ చూపిస్తారో, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో చూడాలని అందరూ వెయిట్ చేస్తున్నారు.

అయితే వివిధ కారణాల వల్ల ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అల్లు అర్జున్, సుకుమార్ ల మీద నెగిటివ్ కామెంట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం 'పుష్ప 2' చిత్రంపై పడుతుందేమో అని, ఓ వర్గం కావాలని ఈ మూవీని టార్గెట్ చెయ్యొచ్చు అనే మాటలు వినిపిస్తున్నాయి. కానీ కంటెంట్ బాగుంటే ఇవన్నీ సినిమాని ఎఫెక్ట్ చేయలేవని అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. కాబట్టి బన్నీ సినిమా నెగెటివిటీని తట్టుకొని నిలబడితే, రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరడం గ్యారంటీ అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి బాక్సాఫీస్ దగ్గర పుష్పరాజ్ జాతర ఎలా ఉంటుందో చూడాలి.

‘పుష్ప-2’ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో 50 రోజుల్లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. డిసెంబరు 5వ తేదీన వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఆల్రెడీ రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. రానున్న రోజుల్లో దూకుడుగా ప్రమోషన్స్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేసే కంటెంట్ వదలబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.