Begin typing your search above and press return to search.

పుష్ప 2.. వేటకు కౌంట్ డౌన్ స్టార్ట్..

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తన పవర్ ఫుల్ పాత్రతో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నాడు.

By:  Tupaki Desk   |   23 Sep 2024 8:48 AM GMT
పుష్ప 2.. వేటకు కౌంట్ డౌన్ స్టార్ట్..
X

డిసెంబర్ 6.. కోసం అల్లు అర్జున్ అభిమానులకి మరుపురాని రోజు కాబోతుంది. ‘పుష్ప: ది రూల్’ మూవీ విడుదల అవ్వబోతున్న సమయం దగ్గరపడుతుండటంతో అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ‘పుష్ప’ మొదటి భాగం విజయవంతం కావడంతో, రెండో భాగం పై ఉన్న క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తన పవర్ ఫుల్ పాత్రతో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నాడు.

75 రోజుల కౌంట్ డౌన్ మొదలైనట్లు మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. దీంతో పుష్ప అభిమానులు ఉత్సాహంతో ఉన్నట్లు కామెంట్స్ చూస్తేనే అర్ధమవుతుంది. ఈ పోస్టర్ లో పుష్పగా అల్లు అర్జున్, తన ఆకర్షణీయమైన ఆత్మవిశ్వాసంతో అభిమానులకు అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇస్తున్నాడు. ఫహద్ ఫాజిల్, రష్మిక మందన్న ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం టాలీవుడ్ మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొల్పింది.

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఊహించని విజయం సాధించేందుకు సిద్ధమవుతోంది. సుకుమార్ క్రియేటివ్ రైటింగ్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, మరియు అల్లు అర్జున్ ఎనర్జీ ఈ సినిమాకి ప్రాణం పోసే అంశాలు. ఏమాత్రం క్లిక్కయినా వెయ్యి కోట్లు పక్కా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కరెక్ట్ గా ఇంకా సినిమా విడుదల కావడానికి 75 రోజుల సమయం ఉంది.

సినిమా వాయిదా పడుతున్నట్లు మధ్యమధ్యలో చాలా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని మేకర్స్ ఇలా పోస్టర్స్ తోనే క్లారిటీ ఇస్తున్నారు. ఇక లేటెస్ట్ టాక్ ప్రకారం, పుష్ప 2 OTT హక్కులు ప్రముఖ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ చేతికి 270 కోట్ల రూపాయలకి అమ్ముడయ్యాయని తెలుస్తోంది. సీక్వెల్ మీద ఉన్న హైప్ కారణంగా ఈ భారీ డీల్ కుదిరినట్టు తెలుస్తోంది.

అంతే కాదు, థియేట్రికల్ రైట్స్ కూడా భారీ స్థాయిలో అమ్ముడయ్యాయని టాక్. మొత్తం 550 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా జరిగినట్టు సమాచారం. రాజమౌళి RRR సినిమాతో 500 కోట్ల థియేట్రికల్ బిజినెస్ రికార్డ్ నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే పుష్ప 2 ఇప్పుడు ఆ రికార్డ్ ని అధిగమించిందని టాక్ వినిపిస్తోంది. ఇక సినిమా విడుదలయ్యాక పాజిటివ్ టాక్ వస్తే, ఈ చిత్రం 1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.