Begin typing your search above and press return to search.

'పుష్ప‌-2' తెర వెనుక రియ‌ల్ హీరో క‌ష్టమిది!

`పుష్ప‌-2` రిలీజ్ కౌంట్ డౌన్ మొద‌లైంది. మ‌రికొన్ని గంట‌ల్లో సినిమా ప్రేక్ష‌కుల ముంద‌కు రానుంది.

By:  Tupaki Desk   |   3 Dec 2024 7:21 AM GMT
పుష్ప‌-2 తెర వెనుక రియ‌ల్ హీరో క‌ష్టమిది!
X

`పుష్ప‌-2` రిలీజ్ కౌంట్ డౌన్ మొద‌లైంది. మ‌రికొన్ని గంట‌ల్లో సినిమా ప్రేక్ష‌కుల ముంద‌కు రానుంది. ఇంకాన్ని గంట‌ల్లోనే ప్రీమియ‌ర్ షోలు ప‌డుతున్నాయి. దీంతో ఆ స‌మ‌యం ఎప్పుడెప్పుడా? అని పుష్ప అభిమానులు ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింద‌నే ప్ర‌చారంతో? `పుష్ప‌-2` లో ఏముందా? అన్న బ‌జ్ అంకంత‌కు ఎక్కువైపోతుంది. రాజ‌మౌళికే సాధ్యం కానిది సుకుమార్ ప్రీరిలీజ్ బిజినెస్ తో సాధించ‌డం అంత‌టా చ‌ర్చ‌కు దారి తీస్తుంది.

మ‌రోవైపు `పుష్ప‌-2` ఎలా ఆడుతుందో చూస్తామంటూ రీజ‌న‌ల్ గా టార్గెట్ చేసిన వ‌ర్గం. ఇలాంటి ఒత్తిళ్ల నడుమ సినిమా రిలీజ్ అవుతుంది. అదంతా ప‌క్క‌న బెడితే ఈ సినిమా కోసం బ‌న్నీ, సుకుమార్ ఎంత‌గా క‌ష్ట‌ప‌డ్డారు? అన్న‌ది ఈ మేకింగ్ వీడియో చూస్తే అర్ద‌మ‌వుతుంది. ప్ర‌తీ షాట్..ప్ర‌తీ ప్రేమ్ కోసం టీమ్ నిజంగా ప్రాణం పెట్టి ప‌నిచేసింది. జీవిత‌మే సినిమా కోసం అంకితం చేసామంటూ నిన్న‌టి రోజున బ‌న్నీ చేసిన వ్యాఖ్య‌ల్లో వంద శాతం నిజం ఉంద‌ని ఆ వీడియో చూసిన త‌ర్వాత ప్ర‌తీ ప్రేక్ష‌కుడు అభిప్రాయ ప‌డుతున్నాడు.

సినిమాలో హీరో బ‌న్నీ అయిన‌...తెర వెనుక రియ‌ల్ హీరో మాత్రం సుకుమార్. ఆయ‌న చెప్పింది మాత్ర‌మే బ‌న్నీ చేసి చూపించాడు. బ‌న్నీ ఏ సీన్ ఎలా న‌టించాలి? ఎంత ఫోక‌స్ గా ప‌నిచేయాలి? ఎంత ఇన్ డెప్త్ ఉండాలి? అన్న‌ది ప్ర‌తీది ఎంతో క్లారిటీగా సుకుమార్ చేసి చూపించారు. ప్ర‌తీ ప్రేమ్ లోనూ ఇద్ద‌రి క‌ష్టం క‌నిపిస్తుంది. సినిమాలో చాలా రిస్కీ షాట్లు క‌నిపిస్తున్నాయి.

తాజాగా వాళ్ల క‌ష్టాన్ని ఉద్దేశించి సుకుమార్ స‌తీమ‌ణి తబిత ఇలా ఎమోష‌న‌ల్ అయ్యారు. `ఇంట్లో ఉండి స్టోరీ చ‌దివే ద‌గ్గ‌ర నుంచి వేదిక‌పై నిల్చుని అంద‌రిచేత ప్ర‌శంస‌లు అందుకునే వ‌ర‌కు మీ ప్ర‌యాణం ఎంతో స్ఫూర్తిదాయ‌కం. ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా మీ టాలెంట్‌, కృషిని ఎంతో మంది గుర్తిస్తారు. మీ స‌క్సెస్‌లో మీ ప‌క్క‌న ఉన్నందుకు చాలా సంతోషంగా, గ‌ర్వంగా ఉంది. మీతో నా జ‌ర్నీ చాలా సంతోషాన్ని ఇస్తుంది` అని రాసుకొచ్చారు. ఇప్పుడా పోస్ట్ నెట్టింట వైర‌ల్ గా మారింది.