Begin typing your search above and press return to search.

పుష్ప-2 రన్ టైమ్.. సెకెండ్ ప్లేస్ లోకి వెళ్తుందా?

వరుస ఈవెంట్స్ తో సినిమాపై ఓ రేంజ్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. కచ్చితంగా తొలి రోజు సినిమా చూడాల్సిందేనట్లుగా హైప్ సృష్టిస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 Nov 2024 5:26 AM GMT
పుష్ప-2 రన్ టైమ్.. సెకెండ్ ప్లేస్ లోకి వెళ్తుందా?
X

టాలీవుడ్ తో పాటు యావత్ భారత సినీ ప్రియులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ పుష్ప-2. లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ఆ మూవీకి సంబంధించి ఇప్పటికే ప్రమోషనల్ కార్యక్రమాలు ఓ రేంజ్‌ లో జరుగుతున్నాయి. పాట్నా, చెన్నై, కొచ్చిలో రీసెంట్ గా ఈవెంట్స్ గ్రాండ్ గా జరిగాయి.

వరుస ఈవెంట్స్ తో సినిమాపై ఓ రేంజ్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. కచ్చితంగా తొలి రోజు సినిమా చూడాల్సిందేనట్లుగా హైప్ సృష్టిస్తున్నారు. తాజాగా ఆ మూవీ సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి. సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అదే సమయంలో మూవీ రన్ టైమ్ 3:18 గంటలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

దీంతో మూవీ నిడివి అంత ఎక్కువా అని కొందరు నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ విషయంపై రీసెంట్ గా నిర్మాత నవీన్‌ ఎర్నేని స్పందించారు. రన్ టైమ్ ఎంత ఉన్నా ఇబ్బందేంలేదని తెలిపారు. మూవీ చూశాక అసలు దాని గురించే మాట్లాడుకోరని చెప్పారు. అయితే రన్‌ టైమ్‌ ఎక్కువ ఉన్నా సినిమా మంచి విజయాన్ని అందుకోవచ్చని ఇప్పటికే పుష్ప-1 నిరూపించింది.

కాబట్టి పార్ట్-2 రన్ టైమ్.. పార్ట్‌ 1 కంటే కాస్త పెరిగినా ప్రేక్షకులు ఆస్వాదించగలరని కొందరు చెబుతున్నారు. అయితే 15 నిమిషాల ఇంటర్వెల్, 10 నిమిషాల యాడ్స్ కలిపితే.. ప్రేక్షకులు 3 గంటల 45 నిమిషాల సమయాన్ని పుష్ప సీక్వెల్ కోసం గడపాలన్న మాట. అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో మరో వార్త చక్కర్లు కొడుతోంది.

తెలుగు సినీ ఇండస్ట్రీలో పుష్ప-2 సెకెండ్ లాంగెస్ట్ రన్ టైమ్ మూవీగా నిలవనుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు 1977లో వచ్చిన దానవీరశూరకర్ణ మూవీ.. 3.46 గంటలతో లాంగెస్ట్ రన్ టైమ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత స్థానాల్లో లవకుశ 3.28 గంటలు.. పాండవ వనవాసం 3.18 గంటలు.. పాతాళ భైరవి 3.15 గంటలతో ఉన్నాయి. గత ఏడాది రిలీజ్ అయిన యానిమల్ నిడివి 3.21 గంటలు.

అర్జున్ రెడ్డి, ఆదిపురుష్, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు కూడా 3 గంటల నిడివితో థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు పుష్ప-2 కూడా మూడు గంటలకు పైగా రన్ టైమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి పుష్ప సీక్వెల్.. ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.