Begin typing your search above and press return to search.

పుష్ప 2 టైటిల్‌ కార్డ్స్‌.. సుక్కు సార్ ఇలా చేశారేం?

దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న పుష్ప 2 నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

By:  Tupaki Desk   |   5 Dec 2024 10:24 AM GMT
పుష్ప 2 టైటిల్‌ కార్డ్స్‌.. సుక్కు సార్ ఇలా చేశారేం?
X

దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న పుష్ప 2 నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో అల్లు అర్జున్‌, రష్మిక మందన్న కలిసి చేసిన సందడి గురించి ఇప్పుడు దేశం మొత్తం చర్చ జరుగుతోంది. పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్‌ నటనకు జాతీయ అవార్డు దక్కాల్సిందే అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రష్మిక మందన్న సైతం జాతీయ అవార్డు దక్కించుకునే స్థాయిలోనే నటించింది అంటూ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు.

సినిమా గురించి ప్రతి విషయంలోనూ సోషల్ మీడియాలో పాజిటివ్‌ ప్రచారం జరుగుతూ ఉంది. ఇలాంటి సమయంలో టైటిల్‌ కార్డ్‌ విషయంలో కాస్త అసంతృప్తిని ప్రేక్షకులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ విషయమై ప్రధానంగా ప్రస్థావిస్తూ వస్తున్నారు. టైటిల్‌ కార్డ్స్ ను అంత సింపుల్‌గా వేయడం ఏంటి అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే, దాన్ని క్రియేటివిటీ అంటూ కొందరు అభినందిస్తూ ఉన్నారు. ఇటీవల వచ్చిన సినిమా టైటిల్‌లతో పోల్చి చూస్తే కచ్చితంగా పుష్ప 2 టైటిల్‌ కార్డ్ విషయంలో అసంతృప్తి ఉంటుంది.

దర్శకుడు సుకుమార్ మెయిన్‌ కంటెంట్‌ పై దృష్టి పెట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలను లైట్‌ తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఫ్యాన్స్ మాత్రం ఏ ఒక్కటి వదిలి పెట్టరు. ప్రతిదీ చాలా తీవ్రంగా తీసుకుంటారు, అందుకే ఇప్పుడు పుష్ప 2 టైటిల్‌ కార్డ్‌ విషయంలో సుకుమార్‌ను ప్రశ్నిస్తూ ఉన్నారు. సినిమాకి హిట్‌ టాక్‌ వచ్చింది కనుక పర్వాలేదు, అదే అటు ఇటు అయ్యి ఉంటే అదే మెయిన్‌ హైలైట్‌ అనేవారేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. టైటిల్ కార్డ్‌ ఎలా ఉంటే ఏంటి సినిమా ఇరగదీసింది కదా అంటూ నెటిజన్స్ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు.

పుష్ప 2 లోని అల్లు అర్జున్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌కి విజిల్స్ పడుతూనే ఉన్నాయి. ఈ స్థాయి ఇంట్రడక్షన్‌ ఇండియన్‌ సినిమాలో మరే హీరోకి దక్కలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బాక్సాఫీస్‌ వద్ద మొదటి రోజు రూ.300 కోట్ల వసూళ్లు నమోదు చేస్తుందని పుష్ప 2 గురించి విశ్లేషకులు వేసిన అంచనాకి చాలా దగ్గరగా ఉంది. నేడు రాత్రి వరకు ఆ నెంబర్‌ను చేరుకునే అవకాశాలు ఉన్నాయి. బుక్‌ మై షో లో రికార్డ్‌ స్థాయిలో టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. కనుక వీకెండ్‌ వరకు ఈ సినిమా వసూళ్లు కళ్లు చెదిరే విధంగా నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి.