Begin typing your search above and press return to search.

పుష్ప-2.. చాలా గర్వంగా ఉంది: మైత్రీ గ్రూప్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప-2 రిలీజ్ కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 Dec 2024 4:07 AM GMT
పుష్ప-2.. చాలా గర్వంగా ఉంది: మైత్రీ గ్రూప్
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప-2 రిలీజ్ కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే నిన్న రాత్రి మేకర్స్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో వారిద్దరితో పాటు సీఈఓ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవి వారి మాటల్లోనే..

"అందరికీ థ్యాంక్స్. పుష్ప సీక్వెల్ కోసం మూడేళ్లు కష్టపడ్డాం. ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి రిలీజ్ డేట్ వరకు వచ్చాం. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నాం. దేవి శ్రీ ప్రసాద్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యూజిక్ అందించారు. కుబా గారు ఎక్స్ట్రా ఆర్డినరీ సినిమాటోగ్రఫీ అందించారు. రూపని గారు మంచి స్టైలిస్ట్" అని నిర్మాత రవిశంకర్ ప్రశంసించారు.

రష్మిక, శ్రీలీల అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందించారని కొనియాడారు. హీరో అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా తాను చెప్పకర్లేదని, ప్రపంచవ్యాప్తంగా వేరే లెవెల్ లో మెచ్చుకుందని తెలిపారు. పార్ట్ -1కి గాను నేషనల్ అవార్డు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పార్ట్ -2కి కూడా కచ్చితంగా నేషనల్ అవార్డు ఇవ్వలనేలా ఆయన పెర్ఫార్మెన్స్ ఉంటుందని అంచనాలు పెంచారు

"సుకుమార్ పడిన కష్టానికి ప్రతిఫలం 5వ తేదీ చూడబోతున్నాం. కచ్చితంగా ఇది పెద్ద సినిమా అవుతుంది. అది సుకుమార్ గారి వల్లే. ఆయన పని తనం కోసం ఎప్పుడు నుంచో ఒక మాట చెప్పాలి అనుకుంటున్న. ఒక సీన్ గురించి డిస్కషన్ జరిగితే ఒక స్టేజ్ కు వచ్చాక అద్భుతంగా ఉందని అంతా ఆనందపడతారు. కానీ సుకుమార్ పనితనం అక్కడే మొదలు అవుతుంది" అని కొనియాడారు.

"ఎవరైతే అద్భుతంగా ఉందని చెబుతారో వాళ్ళను షార్ప్ చేయడమే సుకుమార్ రైటింగ్. సినిమా కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. తమిళనాడు, కర్ణాటక, కేరళ, నార్త్ అమెరికా సహా వరల్డ్ వైడ్ గా మూవీ రిలీజ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ అంతా మా ఎక్సటెండెడ్ ఫ్యామిలీ. బ్రహ్మాండంగా సినిమాను ఆర్గనైజ్ చేస్తున్నారు. 12500 స్క్రీన్స్ లో మూవీ రిలీజ్ చేస్తున్నాం" అని చెప్పారు.

"చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్లీ పుష్ప 2 థియేటర్స్ లోకి డిసెంబర్ 5వ తేదీన వస్తుంది. డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9.30.. థియేటర్స్ కి వెళ్లి సినిమా చూసి ఆదరిస్తారని సినిమాను పెద్ద హిట్ చేస్తారని నమ్ముతున్నాం" అన్ని నిర్మాత నవీన్ యెర్నేని తెలిపారు. ఇంత పెద్ద సినిమా చేసిన అవకాశం దక్కినందుకు చాలా గర్వంగా ఉందని సీఈఓ చెర్రీ తెలిపారు.

వరల్డ్ వైడ్ గా పుష్ప-2 మూవీ ఏడు ఫార్మాట్స్ లో రిలీజ్ అవుతుందని చెప్పారు. డాల్బీ, ఐమాక్స్, 4D X, 2D, 3D సహా పలు ఫార్మాట్స్ లో విడుదల అవ్వనుందని తెలిపారు. బిగ్గెస్ట్ రిలీజెస్ లో ఈ మూవీ ఒకటని చెప్పారు. ఆ సినిమాను ప్రజెంట్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. హైదరాబాద్ ఈవెంట్ ను చాలా బాగా ఏర్పాటు చేసిన వారికి కూడా కృతజ్ఞతలు చెప్పారు.