Begin typing your search above and press return to search.

ఓఎస్టీ వస్తే కానీ దేవి రేంజ్ అర్ధం కాలెదా..?

ఐతే పుష్ప 2 ని అనుకున్న డేట్ కి రిలీజ్ చేయాలనే కారణంతో వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో కూడా పుష్ప 2 కి పని చేయించాల్సి వచ్చింది.

By:  Tupaki Desk   |   22 Jan 2025 6:26 AM GMT
ఓఎస్టీ వస్తే కానీ దేవి రేంజ్ అర్ధం కాలెదా..?
X

అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకు తెర మీద నటీనటులు, తెర వెనుక డైరెక్టర్ సుకుమార్ ఇలా అందరు తమ బెస్ట్ ఎఫర్ట్స్ ఇవ్వడం వల్ల సినిమా ఆ రేంజ్ సూపర్ హిట్ అయ్యింది. ఐతే పుష్ప 2 సినిమా హిట్ కు మరో హైలెట్ దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్. పుష్ప 1 తోనే సినిమాకు సంగీతం తో కూడా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చాడు డిఎస్పీ. ఇక పార్ట్ 2 కి కూడా తన మార్క్ మ్యూజిక్ ఇచ్చాడు.

ఐతే పుష్ప 2 ని అనుకున్న డేట్ కి రిలీజ్ చేయాలనే కారణంతో వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో కూడా పుష్ప 2 కి పని చేయించాల్సి వచ్చింది. సామ్ సి.ఎస్ కూడా పుష్ప 2 కి అడిషన్స్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఐతే దేవి శ్రీ ప్రసాదే సినిమాకు ఎక్కువ పనిచేశాడు. లేటెస్ట్ గా పుష్ప 2 సినిమా ఓ.ఎస్.టి రిలీజైంది. అందులో సినిమాలో గూస్ బంప్స్ తెచ్చిన ఆర్.ఆర్ క్రెడిట్స్ అంతా దేవి శ్రీ ప్రసాద్ మీద ఉన్నాయి.

ఓ.ఎస్.టీ వస్తేనే కానీ దేవి శ్రీ ప్రసాద్ రేంజ్ ఏంటన్నది ప్రేక్షకులకు అర్థం అవ్వలేదు. పుష్ప 2 కి కూడా పూర్తిగా దేవి ఒక్కడే మ్యూజిక్ ఇవ్వాల్సి ఉన్నా సినిమా అనుకున్న డేట్ కి రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో దేవి శ్రీ ప్రసాద్ కి ఇష్టం లేకపోయినా కూడా వేరే సంగీత దర్శకుడు పుష్ప 2 కి కొన్ని ఎపిసోడ్స్ కి మ్యూజిక్ ఇచ్చాడు. ఐతే దాని వల్ల సినిమాకు ప్లస్ అయితే అయ్యింది కానీ పుష్ప 2 ఓ.ఎస్.టీ వచ్చాక తెలిసింది ఏంటంటే కొన్ని సీన్స్ తప్ప సినిమా మొత్తం దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ నే వాడినట్టు అనిపిస్తుంది.

దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తన మార్క్ చూపించే మ్యూజిక్ అందించాడు. పుష్ప 2 తో మళ్లీ తన సత్తా చాటిన దేవి శ్రీ ప్రసాద్ రాబోతున్న సినిమాలతో కూడా అదరగొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ లో నాగ చైతన్య తండేల్ వస్తుంది. ఇప్పటికే ఆ సినిమా నుంచి రిలీజైన రెండు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అంతేకాదు ధనుష్ కుబేరకు కూడా దేవి మ్యూజిక్ అందిస్తున్నాడు కాబట్టి ఈ ఇయర్ దేవి మోత ఒక రేంజ్ లో ఉండబోతుందని చెప్పొచ్చు.