వెయ్యి కోట్ల పుష్ప-2!
అన్ని రకాల ఆదాయాలు కలిపి ఈ చిత్రానికి బిజినెస్ వెయ్యి కోట్లు దాటిపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
By: Tupaki Desk | 22 Oct 2024 10:28 AM GMTఇండియన్ ఫిలిం హిస్టరీలోనే మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటిగా ‘పుష్ప-2’ను చెప్పొచ్చు. బాహుబలి, కేజీఎఫ్ తర్వాత అంత క్రేజ్ ఉంది ఈ చిత్రానికి. పుష్ప-1 రిలీజ్‌కు ముందు హిందీలో అస్సలు బజ్ లేదు. కానీ ఆ సినిమా నార్త్ ఇండియాలో సూపర్ హిట్ అయి పార్ట్-2కు తిరుగులేని క్రేజ్ తీసుకొచ్చింది. సినిమా ఆగస్టు 15 నుంచి డిసెంబరు 6కు వాయదా పడ్డా సరే.. క్రేజ్ ఏమీ తగ్గలేదు. విడుదల ముంగిట హైప్ ఇంకా పెరుగుతోంది కూడా. ఈ చిత్రానికి బిజినెస్ కూడా ఊహించని స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. అన్ని రకాల ఆదాయాలు కలిపి ఈ చిత్రానికి బిజినెస్ వెయ్యి కోట్లు దాటిపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీ, తెలంగాణ కలిపి ‘పుష్ప-2’ థియేట్రికల్ హక్కులు రూ.220 కోట్లు పలికినట్లు అంచనా. ఇక కర్ణాటక హక్కులు రూ.30 కోట్లకు అమ్ముడయ్యాయట. తమిళనాడులో రూ.50 కోట్లు, కేరళలో రూ.20 కోట్లకు ఈ సినిమా బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. ‘పుష్ప-2’ హిందీ వెర్షన్ హక్కులు ఏకంగా రూ.200 కోట్లు పలికాయట. ఓవర్సీస్ రైట్స్ అన్నీ కలిపి రూ.120 కోట్లు తెచ్చిపెడుతున్నట్లు సమాచారం. మొత్తంగా ‘పుష్ప-2’ థియేట్రికల్ బిజినెస్ 640 కోట్ల మేర జరిగినట్లు తెలుస్తోంది. ఇక నెట్ ఫ్లిక్స్ సంస్థ ‘పుష్ప-2’ డిజిటల్ రైట్స్‌కు రూ.275 కోట్లు చెల్లిస్తోందట. ‘పుష్ప-1’ను అమేజాన్ ప్రైమ్ కొనగా.. సెకండ్ పార్ట్‌ను ఫ్యాన్సీ ప్రైస్‌తో నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ‘పుష్ప-2’ మ్యూజిక్ రైట్స్ రూ.65 కోట్లు పలకగా.. శాటిలైట్ హక్కులను రూ.85 కోట్లకు అమ్మారట. మొత్తంగా లెక్క రూ.1065 కోట్లకు చేరుకుంది. బాహుబలి లాంటి విజువల్ వండర్ కాకపోయినా వెయ్యి కోట్లకు పైగా బిజినెస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దీన్ని బట్టే ‘పుష్ప-2’కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.