Begin typing your search above and press return to search.

పుష్ప 2తో ఆకు చాటు పిందె తడిసె..

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రకమైన ట్రెండ్ నడుస్తోంది. లేటెస్ట్ సినిమాలోని డ్యూయెట్ సాంగ్స్ లో హీరో, హీరోయిన్స్ వేసే డాన్స్ స్టెప్పులని పాత పాటలకి సింక్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   6 Dec 2024 4:30 PM GMT
పుష్ప 2తో ఆకు చాటు పిందె తడిసె..
X

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రకమైన ట్రెండ్ నడుస్తోంది. లేటెస్ట్ సినిమాలోని డ్యూయెట్ సాంగ్స్ లో హీరో, హీరోయిన్స్ వేసే డాన్స్ స్టెప్పులని పాత పాటలకి సింక్ చేస్తున్నారు. ఇలాంటి రీమిక్స్ సాంగ్స్ కి హీరో, హీరోయిన్స్ డాన్స్ స్టెప్పులు సింక్ అయితే అవి బాగా వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ కూడా ఇలాంటి వాటిని బాగానే ఆస్వాదిస్తున్నారు. అందుకే రీమిక్స్ సాంగ్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి.

సరదాగా చేసిన కూడా ఇలాంటి పాత రీమిక్స్ సాంగ్స్ కి నెటిజన్లు నుంచి మంచి స్పందన వస్తోంది. ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’లోని చివరిగా వచ్చిన పీలింగ్స్ అనే మాస్ డ్యూయెట్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అల్లు అర్జున్ రష్మిక ఈ సాంగ్ లో అదిరిపోయే డాన్స్ స్టెప్పులతో అలరించారు. బన్నీకి పోటీగా రష్మిక డాన్స్ మూమెంట్స్ చేయడం విశేషం.

అయితే ఈ పాటలోని డాన్స్ ని సీనియర్ ఎన్టీఆర్ ‘వేటగాడు’ సినిమాలోని ఎవర్ గ్రీన్ సాంగ్ అయిన ఆకుచాటు పిందె తడిసెకి సింక్ చేశారు. ఈ సింక్ చేసిన సాంగ్ అండ్ డాన్స్ వీడియోని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో అల్లు అర్జున్, రష్మిక డాన్స్ స్టెప్పులు ఆకుచాటుకి పెర్ఫెక్ట్ గా సింక్ అయ్యాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

లిరిక్స్ కి, డాన్స్ మూమెంట్స్ కరెక్ట్ గా మ్యాచ్ అయ్యాయని నెటిజన్లు అంటున్నారు. ఆకుచాటు సాంగ్ లో ఉన్న ఎనర్జీకి డాన్స్ లో స్పీడ్ జోడిస్తే ఈ తరహాలోనే ఉంటుందని అంటున్నారు. గతంలో పాత సినిమాలలోని హిట్ సాంగ్స్ ని రీమేక్ చేస్తూ ఉండేవారు. అలా వచ్చిన వాటిలో కొన్ని వర్క్ అవుట్ అయ్యాయి. మరికొన్ని ఫెయిల్ అయ్యాయి.

అయితే ‘పుష్ప 2’లోని పీలింగ్స్ సాంగ్ లో డాన్స్ మాత్రం ‘వేటగాడు’ సినిమాలోని ఆకుచాటు పాటకి సరిగ్గా సెట్ అయ్యిందని ఆ వీడియో చూస్తున్న వారు అంటున్నారు. మరి ఈ రీమిక్స్ వీడియో సాంగ్ ఏ మేరకు వైరల్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.