Begin typing your search above and press return to search.

పుష్ప 2 అమెరికా బాక్సాఫీస్.. ప్రీమియర్ షోలతో వైల్డ్ ఎటాక్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ పుష్ప 2: ది రూల్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది

By:  Tupaki Desk   |   4 Dec 2024 5:25 AM GMT
పుష్ప 2 అమెరికా బాక్సాఫీస్.. ప్రీమియర్ షోలతో వైల్డ్ ఎటాక్!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ పుష్ప 2: ది రూల్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి నార్త్ అమెరికా ప్రీమియర్ షోలకు సాలీడ్ రెస్పాన్స్ లభిస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమాకు ఇప్పటివరకు $2.5 మిలియన్ ప్రీ సేల్స్ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో టాలీవుడ్ లో సాధించిన బెస్ట్ రికార్డ్‌గా నిలిచింది.

ఇక వివరాల్లోకి వెళితే, పుష్ప 2 యూఎస్‌లో 1048 థియేటర్లలో 4003 ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. ఇప్పటివరకు మొత్తం 81,340 టికెట్లు అమ్ముడైనట్లు ట్రేడ్ విశ్లేషకులు తెలిపారు. ఈ రికార్డ్‌తో, పుష్ప 2 నార్త్ అమెరికా మార్కెట్లో ఒక పెద్ద రికార్డ్ ను అందుకుంది. $2.1 మిలియన్ డాలర్ల కలెక్షన్‌తో తెలుగు వెర్షన్ టాప్‌లో నిలిచింది.

అయితే ఇతర భాషల్లో కూడా మంచి ఆదరణ కనిపిస్తోంది. హిందీ వెర్షన్‌కు $150K, తమిళంలో $25K, మలయాళం అలాగే కన్నడ భాషల్లో $15K కలెక్షన్స్ రాబట్టాయి. ఈ సంఖ్యలు పుష్ప 2 పాన్ ఇండియా స్థాయిని హైలెట్ చేస్తోంది. కానీ, తెలుగులో ఉన్న భారీ హైప్‌కు తగ్గట్టుగా ప్రీ సేల్స్ కొద్దిగా తక్కువగా ఉన్నాయని అనిపిస్తోంది. ప్రీమియర్ షోల తర్వాత టాక్ వల్ల కలెక్షన్స్ మరింత పెరుగుతాయనే ఆశాభావం వ్యక్తం అవుతోంది.

ఇదిలా ఉంటే, పుష్ప 2 ఈ రికార్డులతో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, బాహుబలి వంటి భారీ సినిమాల రికార్డులను అందుకోవడానికి సిద్ధమవుతోంది. ప్రత్యేకంగా నార్త్ అమెరికాలో టికెట్ ధరలు భారీగా ఉన్నా కూడా ప్రేక్షకులు పుష్పరాజ్ మేనియాకు ఫిదా అవుతున్నారు. ఇక, ప్రీమియర్ షోల తర్వాత వీకెండ్‌లో కూడా సినిమా భారీ కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

పుష్ప 2 ఈ స్థాయి ప్రీ సేల్స్ ద్వారా, ఇండియన్ సినిమాల రేంజ్ ను అంతర్జాతీయ స్థాయిలో మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కలిసొచ్చి ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి, పుష్ప 2 ప్రీమియర్ షోలకే ఇంతటి ఆదరణ దక్కడం, ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్లో తెలుగు సినిమా హవాను మరింత ప్రదర్శిస్తోంది. వచ్చే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.