పుష్ప 2…. 7 ఏళ్ళ రికార్డ్ బ్రేక్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ కలెక్షన్స్ సునామీ ఇంకా కొనసాగుతూనే ఉంది. తగ్గేది లే అంటూ థియేటర్స్ లో ఈ సినిమా వసూళ్ళ పర్వం సాగుతోంది.
By: Tupaki Desk | 17 Dec 2024 6:47 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ కలెక్షన్స్ సునామీ ఇంకా కొనసాగుతూనే ఉంది. తగ్గేది లే అంటూ థియేటర్స్ లో ఈ సినిమా వసూళ్ళ పర్వం సాగుతోంది. రెండో వారంలో కూడా ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతూ ఉండటం విశేషం. సుకుమార్ రైటింగ్, అల్లు అర్జున్ యాక్టింగ్ కి అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అందుకే ఈ స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి. కేవలం 11 రోజుల్లోనే 1300 కోట్ల కలెక్షన్స్ ని అందుకోవడం ద్వారా ‘పుష్ప 2’ సరికొత్త రికార్డ్ నమోదు చేసింది.
హిందీలో కూడా 561+ కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని జెట్ స్పీడ్ తో ఈ చిత్రం దూసుకుపోతోంది. హిందీలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న డబ్బింగ్ మూవీగా ‘బాహుబలి 2’ ఉండేది. ఏడేళ్లుగా ఈ సినిమా రికార్డ్ పదిలంగా ఉంది. అయితే ‘పుష్ప 2’ కేవలం 11 రోజుల్లోనే ఈ రికార్డ్ ని బ్రేక్ చేసేసింది. ఇప్పుడు హిందీలో కూడా అత్యధిక కలెక్షన్స్ అందుకోబోయే చిత్రంగా నెంబర్ వన్ స్థానంలోకి ఈ మూవీ వెళ్లబోతోంది.
దేశంలోనే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల జాబితాలో కూడా టాప్ 3లోకి ‘పుష్ప 2’ వచ్చింది. ఈ కలెక్షన్స్ అందుకోవడానికి ‘బాహుబలి 2’కి 16 రోజుల సమయం పట్టింది. అయితే ‘పుష్ప 2’ మాత్రం కేవలం 11 రోజుల్లోనే సాధించింది. అంటే యావరేజ్ గా ఈ మూవీ రోజుకి 118 కోట్ల మేరకు కలెక్ట్ చేసిందని చెప్పొచ్చు. నార్త్ అమెరికాలో కూడా ఈ మూవీ కలెక్షన్స్ 14 మిలియన్ డాలర్స్ కి దగ్గరగా ఉంది. సోమవారం నార్త్ అమెరికాలో ఈ చ్చిత్రం 175K డాలర్స్ కలెక్ట్ చేసింది.
దీంతో టోటల్ నార్త్ అమెరికాలో $13,028,000 కలెక్షన్స్ అందుకుంది. ఇక 12వ రోజైన సోమవారం దేశ వ్యాప్తంగా ఈ సినిమాకి 19474 షోలు పడ్డాయి. తద్వారా 26.49 కోట్ల కలెక్షన్స్ ని ఈ మూవీ సాధిస్తే అందులో 20.39 కోట్లు కేవలం హిందీ నుంచి వచ్చాయి. రెండో శుక్రవారంతో పోల్చుకుంటే రెండో సోమవారం కేవలం 29% శాతం మాత్రమే కలెక్షన్స్ తగ్గాయి.
దీనిని బట్టి ఈ సినిమా సెకండ్ వీక్ డేస్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ తో ప్రేక్షకులని థియేటర్స్ కి రప్పిస్తుందనే మాట వినిపిస్తోంది. సెకండ్ ఫ్రైడే ఈ సినిమా దేశ వ్యాప్తంగా 19,845 షోలలో ప్రదర్శించబడింది. వీటి ద్వారా 37.34 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. హిందీలోనే 28.48 కోట్లు వసూళ్లు చేసింది. దీనిని బట్టి నార్త్ ఇండియా బెల్ట్ లో పుష్ప 2 సినిమాకి ఏ స్థాయిలో ఆదరణ వస్తుందో అర్ధం చేసుకోవచ్చు.