Begin typing your search above and press return to search.

21వ రోజు.. పుష్ప 2నే టాప్

21 వ రోజు తెలుగులో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల జాబితా చూసుకుంటే ‘పుష్ప 2’నే టాప్ లో ఉంది.

By:  Tupaki Desk   |   27 Dec 2024 7:36 AM
21వ రోజు.. పుష్ప 2నే టాప్
X

‘పుష్ప 2’ మూవీకి తెలుగు రాష్ట్రాలలో కూడా మూడో వారం కలెక్షన్స్ అనూహ్యంగా పెరగడం విశేషం. రెండో వారంలో ఈ సినిమా కలెక్షన్స్ కొంత వరకు డ్రాప్ కనిపించిన క్రిస్మస్ హాలిడేస్ కలిసి రావడంతో ఆడియన్స్ మరల మూవీ చూడటానికి థియేటర్స్ కి వెళ్తున్నారు. దీంతో కలెక్షన్స్ కూడా మళ్ళీ పుంజుకున్నాయి. దీంతో 21వ రోజు ‘పుష్ప 2’ చిత్రానికి తెలుగు రాష్ట్రాలలో 2.34 కోట్ల షేర్ రావడం విశేషం.

21 వ రోజు తెలుగులో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల జాబితా చూసుకుంటే ‘పుష్ప 2’నే టాప్ లో ఉంది. ఈ సినిమా తర్వాత అత్యధిక షేర్ అందుకున్న చిత్రంగా ‘కల్కి 2898ఏడీ’ నిలిచింది. ఇక ‘బాహుబలి 2’ మూవీ మూడో స్థానంలో ఉంది. 21వ రోజు ఈ సినిమా 1.36 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇక నాలుగో స్థానంలో ఉన్న ‘అల వైకుంఠపురంములో' మూవీ 1.20 కోట్ల షేర్ ని వసూళ్లు చేయడం విశేషం.

21వ రోజు కూడా ‘పుష్ప 2’ మూవీ మంచి వసూళ్లు అందుకోవడంతో నెక్స్ట్ శని, ఆదివారాలు కూడా మంచి కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో షేర్ పరంగా ‘పుష్ప 2’ మూవీ ‘బాహుబలి 2’ని క్రాస్ చేసి టాప్ 2లోకి వచ్చింది. 210 కోట్ల షేర్ కి దగ్గరలో ‘పుష్ప 2’ కలెక్షన్స్ ఉన్నాయని తెలుస్తోంది.

ఇదే స్పీడ్ లో మూవీ కలెక్షన్స్ జోరు కొనసాగిస్తే తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ అందుకొని లాభాల బాటలోకి వెళ్ళడానికి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు. నాలుగో వారం లో బ్రేక్ ఈవెన్ దాటిపోయే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 150 కోట్ల ప్రాఫిట్ కి దగ్గరలో ఉందనే మాట వినిపిస్తోంది. ఈ ఏడాది అత్యధిక ప్రాఫిట్ అందుకున్న సినిమాల జాబితాలోకి ‘పుష్ప 2’ కూడా రాబోతోంది.

21వ రోజు తెలుగు రాష్ట్రాలలో అత్యదిక షేర్ అందుకున్న సినిమాలు

పుష్ప 2 ది రూల్ - 2.34 కోట్లు***

కల్కిi2898ఏడీ - 1.52 కోట్లు

బాహుబలి 2 - 1.36 కోట్లు

అల వైకుంఠపురంలో - 1.20 కోట్లు

ఆర్ఆర్ఆర్ - 96 లక్షలు

బాహుబలి - 85 లక్షలు

అత్తారింటికి దారేది – 82 లక్షలు

దేవర – 71 లక్షలు

కేజీఎఫ్ చాప్టర్ 2 – 55 లక్షలు

హనుమాన్ – 52 లక్షలు