Begin typing your search above and press return to search.

సినిమా టికెట్ అమ్మకాలలో పుష్ప 2 రికార్డులు

ఈ జాబితాలో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' చిత్రం సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. విడుదలైన 14 రోజుల్లోనే ఈ సినిమా 16.19 మిలియన్ టికెట్లను అమ్ముడవడం విశేషం.

By:  Tupaki Desk   |   19 Dec 2024 7:30 AM GMT
సినిమా టికెట్ అమ్మకాలలో పుష్ప 2 రికార్డులు
X

ఇండియన్ సినిమాలకు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు రావడంలో పలు ప్రతిష్టాత్మక చిత్రాలు మార్కెట్ వాల్యుని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. టికెట్ అమ్మకాల పరంగా ఇండియన్ సినిమాలు ఇప్పటికే చాలా రికార్డులు సృష్టించాయి. అందులోనూ టాలీవుడ్ సినిమాలకు ఈమధ్య అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. లేటెస్ట్ గా ఈ జాబితాలో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' చిత్రం సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. విడుదలైన 14 రోజుల్లోనే ఈ సినిమా 16.19 మిలియన్ టికెట్లను అమ్ముడవడం విశేషం.

ఆన్ లైన్ లో టిక్కెట్ అమ్మకాల పరంగా ఇప్పటి వరకు పలు చిత్రాలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇక బుక్ మై షో వంటి ప్రఖ్యాత ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లో పుష్ప 2 రికార్డులను తాకింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ హై వోల్టేజ్ యాక్టింగ్ స్కిల్స్, సుకుమార్ మాస్టర్ స్ట్రోక్ డైరెక్షన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పుష్ప 2 గ్లోబల్ లెవల్లో ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా, టికెట్ అమ్మకాల విషయంలో మరింత ముందుకు దూసుకెళ్తుంది.

'కేజీఎఫ్ 2', 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' వంటి బిగ్గెస్ట్ హిట్ సినిమాలతో పోలిస్తే పుష్ప 2 కేవలం రెండు వారాల్లోనే రెండవ స్థానంలో నిలవడం గమనార్హం. పుష్ప 2 చిత్రం సాధించిన ఈ ఘనత, అల్లు అర్జున్ స్టార్‌డమ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. సినిమా విడుదలకు ముందే టికెట్ అమ్మకాల పరంగా ఈ స్థాయిలో లెక్కలు నమోదు కావడం టాలీవుడ్ స్థాయిని బాలీవుడ్‌తో సమానంగా నిలిపే ప్రయత్నానికి నిదర్శనం.

మరోవైపు 'పుష్ప 2' మూవీ కంటే టికెట్ అమ్మకాల పరంగా 'కేజీఎఫ్ 2' మొదటి స్థానంలో ఉంది. అయితే, ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే, పుష్ప 2 త్వరలోనే కేజీఎఫ్ 2 రికార్డును కూడా దాటవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో బాహుబలి 2 కూడా టాప్ 3లో ఉంది. ఇక రాబోయే రోజుల్లో పుష్ప 2 చిత్రం ఇంకెంత టికెట్ అమ్మకాల రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

బుక్ మై షో టాప్ 5 టికెట్ అమ్మకాల రికార్డుల జాబితా ఇలా ఉంది

1. కేజీఎఫ్ 2 - 17.1 మిలియన్

2. పుష్ప 2 - 16.19 మిలియన్ (14 రోజులు)

3. బాహుబలి 2 - 16 మిలియన్

4. ఆర్ఆర్ఆర్ - 13.4 మిలియన్

5. కల్కి 2898 ఏడి - 13.14 మిలియన్