Begin typing your search above and press return to search.

పుష్ప 2: సంధ్య థియేటర్ కలెక్షన్లు ఎంత?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఐకానిక్ మూవీ ‘పుష్ప 2’ వరల్డ్ వైడ్ గా 1700 కోట్లకి పైగా కలెక్షన్స్ ని అందుకుంది.

By:  Tupaki Desk   |   30 Dec 2024 7:00 AM GMT
పుష్ప 2: సంధ్య థియేటర్ కలెక్షన్లు ఎంత?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఐకానిక్ మూవీ ‘పుష్ప 2’ వరల్డ్ వైడ్ గా 1700 కోట్లకి పైగా కలెక్షన్స్ ని అందుకుంది. తెలుగులో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా ఈ మూవీ నిలిచింది. అలాగే ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో టాప్ 3లో ఉంది. ఇక హిందీలో కూడా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఈ మూవీ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ చిత్రం 300 కోట్లకి పైగా కలెక్షన్స్ ని అందుకుంది. 220 కోట్లకి దగ్గర్లో ఈ తెలుగు రాష్ట్రాల షేర్ ఉంది. అలాగే నైజాంలో ఈ చిత్రం కలెక్షన్స్ 100 కోట్లకి దగ్గరగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా హైదరాబాద్ లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో కోటి రూపాయిలకి పైగా కలెక్షన్స్ వచ్చాయి.

ఓవరాల్ గా 7 సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ‘పుష్ప 2’ మూవీ కోటికి పైగా కలెక్షన్స్ దాటాయి. వీటిలో అత్యధికంగా సంధ్య థియేటర్స్ లో రావడం విశేషం. ఈ థియేటర్ లో మూవీ కలెక్షన్స్ కోటిన్నర దాటినట్లు తెలుస్తోంది. ఆ థియేటర్ లో తొక్కిసలాట ఘటనలో ఒకరు మరణించిన విషయం తెలిసిందే. ఇక చట్టపరమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికి అక్కడ కలెక్షన్లు ఎక్కువగానే వచ్చాయి.

అలాగే శ్రీరాములు థియేటర్ లో కూడా మంచి వసూళ్లు వచ్చాయి. విశ్వనాథ్, విమల్, మల్లికార్జున, ఈశ్వర్, గోకుల్ థియేటర్స్ లలో కోటికి పైగా కలెక్షన్స్ నమోదు అయ్యాయి. అంటే నైజాంలో ‘పుష్ప 2’ కలెక్షన్స్ లలో ఎక్కువ భాగం హైదరాబాద్ సిటీ నుంచి వచ్చాయి. ఈ మూవీ నైజాంలో 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని దాటుతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు.

ఇక సీడెడ్ లో కూడా ఈ మూవీ 30 కోట్లకిపైగా కలెక్షన్స్ ని అందుకుంది. అక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటేసి లాభాల బాటలో నడుస్తోంది. ఆంధ్రాలో ఇంకా బ్రేక్ ఈవెన్ అందుకోవాల్సి ఉంది. న్యూ ఇయర్ కి ఎక్స్ ట్రా షోలు పడే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఈ సెలబ్రేషన్ మూడ్ సినిమాకి ప్లస్ అవుతుందేమో అనేది చూడాలి.

ఇదిలా ఉంటే ‘పుష్ప 2’ ప్రభంజనం నాలుగో వారంలో కూడా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది డిసెంబర్ నెల మొత్తం పుష్ప మానియానే దేశవ్యాప్తంగా నడిచిందని ఈ కలెక్షన్స్ జోరు చూస్తుంటే అర్ధమవుతోంది. ఈ స్పీడ్ ఇంకెన్ని రోజులు కొనసాగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. లాంగ్ రన్ లో ఈ చిత్రం కలెక్షన్స్ ఎన్ని కోట్లకి చేరుకుంటాయనేది కూడా వేచి చూడాలి.

హైదరాబాద్ సిటీలో ఏడు థియేటర్లలో కోటి రూపాయల గ్రాస్ దక్కింది

సంధ్య,

శ్రీరాములు,

విశ్వనాధ్,

విమల్,

మల్లికార్ఙున,

ఈశ్వర్,

గోకుల్.