పుష్ప 2 బాక్సాఫీస్.. టోటల్ లెక్క ఇది!
విడుదలైన తొలి రోజే ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే అతి పెద్ద ఓపెనింగ్ డే రికార్డును నమోదు చేసింది.
By: Tupaki Desk | 6 Dec 2024 1:28 PM GMTఅల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సునామీ తరహాలో దూసుకుపోతోంది. విడుదలైన తొలి రోజే ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే అతి పెద్ద ఓపెనింగ్ డే రికార్డును నమోదు చేసింది. బాలీవుడ్ రికార్డులను కూడా దాటేసి పుష్ప బ్రాండ్ పవర్ ను చూపించింది. మేకర్స్ విడుదల చేసిన అఫీషియల్ పోస్టర్ ప్రకారం, సినిమా మొదటి రోజే 294 కోట్ల గ్రాస్‌ను సాధించినట్లు క్లారిటీ ఇచ్చారు.
తొలి రోజే సినిమా అన్ని భాషల్లో కలిపి 294 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం ఆశ్చర్యకరమైన ఫీట్. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదలైంది. ఈ కలెక్షన్లు చూసిన ప్రేక్షకులు సినిమా హవా గురించి అనేక రికార్డుల లెక్కలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. పుష్ప 2 హైప్, అల్లు అర్జున్ క్రేజ్, సుకుమార్ దర్శకత్వ ప్రతిభ అలాగే మిగతా టెక్నీషియన్స్ వర్క్ సినిమాను హిట్టయ్యేలా చేశాయి.
తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఈ సినిమాకు విశేషమైన స్పందన లభించింది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, ఇతర పట్టణాల్లో థియేటర్ ముందు పండగ వాతావరణం కనిపించింది. భారీ టికెట్ రేట్లు ఉన్నప్పటికీ, కలెక్షన్లు ఏమాత్రం తగ్గకపోవడం ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ను వెల్లడిస్తుంది. ఇక ఇండియాలో అత్యధిక ఫుట్ ఫాల్స్ నమోదు చేసిన రెండవ సినిమాగా రికార్డు క్రియేట్ చేయడం విశేషం. బాహుబలి తరువాత మొదటి రోజు ఎక్కువ మంది (71 లక్షలు) వీక్షించిన సినిమాల్లో పుష్ప 2 నిలిచింది.
హిందీ బెల్ట్‌లో కూడా పుష్ప 2 అదే స్థాయిలో ప్రభావం చూపించింది. హిందీ వెర్షన్ గతంలో వచ్చిన సౌత్ సినిమాల రికార్డులను బద్దలు కొట్టింది. హిందీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించడం, అల్లు అర్జున్కు సౌత్ నుండి బాలీవుడ్‌కు వచ్చిన మరొక స్టార్‌గా గుర్తింపు తెచ్చింది. హిందీ లో మొదటి రోజు అత్యధికంగా వసూళ్ళు సాధించిన జవాన్ 65 కోట్ల రికార్డును దాటి పుష్ప 72 కోట్ల నెట్ కలెక్షన్లు అందుకున్నట్లు సమాచారం.
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, కేవలం కథాపరంగా మాత్రమే కాకుండా విజువల్ ట్రీట్ కూడా అందించింది. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చిత్రానికి అదనపు బలం. పుష్ప 2 లో వచ్చే ప్రతి మాస్ సీన్‌ను ప్రేక్షకులు థియేటర్‌లో విజిల్స్ తో ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్, క్లయిమాక్స్ ఫైట్ హైలైట్స్ గా నిలిచాయి. మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 294 కోట్ల గ్రాస్. ఈ నెంబర్ సినిమాకు కొత్త రికార్డును తీసుకొచ్చింది. ఇంతవరకు RRR, బాహుబలి 2, కేజీఎఫ్ 2 వంటి సినిమాలు నిలబెట్టుకున్న రికార్డులను పుష్ప 2 దాటింది. దీన్ని చూసి టాలీవుడ్ మాత్రమే కాదు, బాలీవుడ్, కోలీవుడ్, ఇతర ఇండస్ట్రీలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. మరి రాబోయే రోజుల్లో లెక్క ఇంకా ఏ రేంజ్ లో పెరుగుతుందో చూడాలి.